ప్రపంచంలోనే పవర్ ఫుల్ మిస్సైల్.. భూగోళంపై ఏ మూల ఉన్నా చావే!

ప్రపంచ అణ్వాయుధ చరిత్రలో రష్యా మరో సంచలనానికి తెరలేపింది. శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ, అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 'సర్మట్'ను (Sarmat ICBM) రష్యా విజయవంతంగా పరీక్షించింది. మంగళవారం (మే 12, 2026) జరిగిన ఈ ప్రయోగాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా పర్యవేక్షించి, ప్రపంచ దేశాలకు బలమైన సంకేతాలు పంపారు. పశ్చిమ దేశాలు 'సాటన్-2' (Satan II) అని పిలుచుకునే ఈ క్షిపణి, ప్రస్తుతానికి భూమిపై ఉన్న ఏ రక్షణ వ్యవస్థకూ చిక్కని వినాశకారిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ఈ క్షిపణి సామర్థ్యం వింటేనే అగ్రరాజ్యాలు సైతం విస్తుపోతున్నాయి. సుమారు 35,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని (Range) కలిగిన సర్మట్, భూగోళంపై ఏ మూలన ఉన్న లక్ష్యాన్నైనా క్షణాల్లో ఛేదించగలదు. సబ్-ఆర్బిటల్ మార్గంలో ప్రయాణించే ఈ క్షిపణిని అడ్డుకోవడం ప్రస్తుత క్షిపణి నిరోధక వ్యవస్థలకు అసాధ్యం. సోవియట్ కాలం నాటి 'వొయెవోడా' క్షిపణుల స్థానంలో వీటిని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన పుతిన్.. "ప్రపంచంలో దీనికి సాటి వచ్చే ఆయుధం మరొకటి లేదు" అని గర్వంగా ప్రకటించారు.

Putin Strengthens Nuclear Deterrence Sarmat ICBM To Enter Service By End Of 2026 After Successful Test
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..

ఉక్రెయిన్ యుద్ధ నీడలో వ్యూహాత్మక హెచ్చరిక

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు దశకు చేరుకుందని చెబుతూనే, రష్యా తన అణు త్రయ వ్యవస్థను (Nuclear Triad) మరింత పటిష్టం చేసుకుంటోంది. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు అందిస్తున్న మద్దతును నిరుత్సాహపరచడమే లక్ష్యంగా పుతిన్ ఈ శక్తివంతమైన ప్రయోగాన్ని తెరపైకి తెచ్చారు. అమెరికా తన క్షిపణి రక్షణ కవచాన్ని విస్తరిస్తున్న తరుణంలో, వ్యూహాత్మక సమతుల్యతను కాపాడటానికే తాము ఈ అడుగు వేశామని రష్యా స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరి నాటికే ఈ మహాస్త్రం రష్యా సైన్యంలో పూర్తిస్థాయిలో భాగం కానుంది.

తార జువ్వ: భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం
తార జువ్వ: భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం

వరుస ఆయుధాలతో రష్యా అణు నవీకరణ

కేవలం సర్మట్ మాత్రమే కాదు, ధ్వని కంటే 27 రెట్లు వేగంతో ప్రయాణించే 'అవంగర్డ్' హైపర్‌సోనిక్ వాహనాలను రష్యా ఇప్పటికే మోహరించింది. దీనికి తోడు, సముద్ర తీరాలను తుడిచిపెట్టే 'పోసిడాన్' అండర్‌వాటర్ డ్రోన్, అపరిమిత పరిధి కలిగిన 'బ్యూరెస్ట్నిక్' క్రూయిస్ క్షిపణి కూడా తుది దశకు చేరుకున్నాయి. అమెరికాతో అణ్వస్త్ర నియంత్రణ ఒప్పందం ముగిసిన నేపధ్యంలో, రష్యా చేపడుతున్న ఈ వరుస ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యాల మధ్య ఆయుధ పోటీని మళ్ళీ పతాక స్థాయికి తీసుకెళ్తున్నాయి. మొత్తానికి, 'సర్మట్' ప్రయోగం ద్వారా రష్యా తన సైనిక సత్తాను చాటడమే కాకుండా, తన భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రపంచానికి చాటిచెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+