నిద్రపట్టక, ప్యాలెస్‌లో తిరిగిన రాణికి గార్డ్ నుంచి షాకింగ్ అనుభవం
రాణి లిజబెత్ 2 పైకి గార్డు తుపాకీని ఎక్కు పెట్టాడట. ఇందుకు సంబంధించి ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.
బకింగ్‌హామ్ ప్యాలెస్: రాణి లిజబెత్ 2 పైకి గార్డు తుపాకీని ఎక్కు పెట్టాడట. ఇందుకు సంబంధించి ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. గార్డు తన పైకి తుపాకీ ఎక్కుపెట్టినప్పటికీ ఆమె నవ్వుతూ అతనితో మాట్లాడారట.
ఇది ఏళ్ల క్రితం జరిగింది. ఓ రోజు బకింగ్‌హాం ప్యాలెస్‌లో ఈ సంఘటన జరిగిందట. ఎలిజబెత్ రాణికి ఓ రోజు నిద్రపట్టలేదు. దీంతో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ప్యాలెస్ ప్రాంగణంలో వాకింగ్ చేస్తున్నారు.

ఆ సమయంలో ఓ గార్డు ఆమెను చూశాడు. ఎవరో గుర్తు పట్టలేదు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చారని భావించి.. వెంటనే తుపాకీ గురిపెట్టాడు. ట్రిగ్గర్ పైన వేలు పెట్టి.. మీరు ఎవరు అని అడిగాడు. కాసేపటికి అతను రాణిని గుర్తించాడు.
అనంతరం అతను ఉలిక్కిపడి.. వామ్మో.. నేను మీ పైన కాల్పులు జరపబోయాను అని ఆమెతో అన్నాడు. తనపై కఠిన చర్యలు తప్పవని సదరు గార్డు భావించాడు. ఆ తర్వాత రాణి మాత్రం నవ్వేసి.. ఈసారి కాల్చవలసిన అవసరం లేకుండా నేను నీకు సమాచారం అందిస్తానని చెప్పారట.












Click it and Unblock the Notifications