వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైడెన్ జీవితంలో భయానక విషాదం -జిల్ లేకుంటే ఏమయ్యేవారో! -‘ఫస్ట్ లేడీ’ మెలానియాతో ఢీ

|
Google Oneindia TeluguNews

'లూజర్.. ఫెయిల్యూర్.. నిరాశావాది..'.. ఇవి.. డెమోక్రాట్ అభ్యర్థి జోబైడెన్ ను ఉద్దేశంచి రిపబ్లికన్ క్యాండిడేట్, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తరచూ ఉపయోగించే పదాలు. 50 ఏళ్ల పొలిటికల్ కేరీర్ లో బైడెన్ ఏకంగా 47 భారీ వైఫల్యాలను మూటగట్టుకున్నారంటూ ట్రంప్ శిబిరం ఓ వాణిజ్య ప్రకటనను సైతం రూపొందించింది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఇంక్యుబెంట్ ట్రంప్ కు గట్టి పోటీ ఇస్తోన్న బైడెన్ జీవితంలో నిజంగానే భయానక విషాదాలు చోటుచేసుకున్నాయి. కానీ రెండో భార్య జిల్ బైడెన్ సాయంతో ఆయన కుంగుబాటును, చీకటిని అధిగమించగలిగారు. నవంబర్ 3 తర్వాత వైట్ హౌజ్ లో ఫస్ట్ లేడీ పదవిలో ఎవరుంటారనేదానిపై 'జిల్ వర్సెస్ మెలానియా' పేరిట చర్చ జరుగుతోంది.

సంచైత తండ్రి ఎవరు? వీలునామా ఇదే -విజయసాయి వేళ్లు తెగడం ఖాయం -ఎంపీ రఘురామ సంచలనంసంచైత తండ్రి ఎవరు? వీలునామా ఇదే -విజయసాయి వేళ్లు తెగడం ఖాయం -ఎంపీ రఘురామ సంచలనం

‘ఫస్ట్ లేడీ'ల పోరు..

‘ఫస్ట్ లేడీ'ల పోరు..

ఇంకొద్ది గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. మంగళవారం(నవంబర్3న) పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపడతారు. బుధవారం సాయంత్రంలోపే తదుపరి ప్రెసిడెంట్, తర్వాతి ఫస్ట్ లేడీ ఎవరో తేలిపోనుంది. అధికారికంగా ఫస్ట్ లేడీకి అదనపు అధికారాలు ఉండనప్పటికీ.. అధ్యక్షుడి ఒత్తిడిని పంచుకునే భాగస్వామిగా, సలహాదారుగా భార్యల పాత్ర విశేషమైనదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ట్రంప్ సతీమణి మెలానియా, జో బైడెన్ భార్య జిల్ బైడెన్ లలో ఎవరు ఫస్ట్ లేడీ కావొచ్చనే చర్చ, ఇద్దరి మధ్య పోలిక అనివార్యమైంది.

విభిన్న ధృవాలు..

విభిన్న ధృవాలు..

విదేశాల్లో పుట్టి, అమెరికా ఫస్ట్ లేడీ అర్హత పొందినవాళ్లలో మెలానియా రెండో వ్యక్తి. ఆమె అసలు పేరు ‘మెలానిజా నేవ్స్'. స్లోవేనియాలో జన్మించిన ఆమె.. ఫ్యాషన్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 1996లో అమెరికాలో కాలుమోపారు. రియల్ ఎస్టేట్, హోటల్ రంగంలో టైకూన్ గా పేరుపొందిన డొనాల్డ్ ట్రంప్ తన పేరుతో మోడల్ మేనేజ్మెంట్ ను కూడా నడిపేవారు. ఆ సంస్థలో మోడల్ గా పని చేసిన మెలానియా కాల క్రమంలో (2005లో) ట్రంప్ మూడో భార్యగా సెటిలయ్యారు. ఖరీదైన దుస్తులు, ఆభరణాల పట్ల మక్కువ ప్రదర్శించే మెలానియా ఫ్యాషన్ ఐకాన్ గా కవర్ పేజీల్లో నిలుస్తారు. మెలానియాతో పోల్చుకుంటే, 2020 ఫస్ట్ లేడీ రేసులో ఉన్న జిల్ బైడెన్ పూర్తిగా భిన్నధృవమని చెప్పాలి..

విద్యావేత్త.. స్ఫూర్తి ప్రదాత..

విద్యావేత్త.. స్ఫూర్తి ప్రదాత..

జో బైడెన్ భార్య జిల్ బైడెన్.. ఫిలడెల్ఫియా పల్లె ప్రాంతంలో పుట్టిపెరిగారు. స్వయంకృషితో ఎదిగిన కుటుంబం ఆమెది. కొన్నాళ్లు మోడలింగ్ చేసినా, తర్వాతి కాలంలో ఉన్నత విద్యపై దృష్టిపెట్టి, డాక్టరేట్ ను పూర్తి చేశారు. బోధనను వృత్తిగా ఎంచుకున్న జిల్.. ఒబామా హయాంలో(అప్పుడు జోబైడెన్ ఉపాధ్యక్షుడు) సెకండ్ లేడీ హోదాలో ఉంటూనే తన వృత్తిని కొనసాగించారు. అమెరికాలో విద్యా వ్యాప్తి, కమ్యూనిటీల బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. నిజానికి బైడెన్ జీవితంలోకి జిల్ రాక నాటకీయంగా జరిగిందిలా...

బైడెన్ భార్య, కూతురు మృతి..

బైడెన్ భార్య, కూతురు మృతి..

అది 1972.. అమెరికా చరిత్రలోనే సెనేట్ కు ఎన్నికైన రెండో పిన్నవయస్కుడిగా 29 ఏళ్లకే జోబైడెన్ రికార్డు నెలకొల్పారు. ‘డెమోక్రటిక్ పార్టీ గోల్డెన్ బాయ్' అనే ఇమేజ్ ఉండేదప్పుడు. సెనేటర్ గా ప్రమాణం చేసేందుకు బైడెన్ వాషింగ్టన్ లో ఉండిపోగా, సొంతఊరు డెలావేర్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన భార్య నీలియా, నెలల వయసున్న కూతురు నవోమీ మృతి చెందారు. ఆ యాక్సిడెంట్ లో బైడెన్ ఇద్దరు కొడుకులూ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. రాజకీయాల్లో తొలి అడుగు వేస్తున్న సమయంలోనే బైడెన్ కుటుంబం విఛ్చిన్నమైంది. ఆస్పత్రిలో కొడుకుల బెడ్ల పక్కనే నిలబడి బైడెన్ సెనేటర్ గా ప్రమాణం చేశారు. పిల్లల్ని చూసుకుంటూ ప్రతిరోజూ డెలావేర్ నుంచి వాషింగ్టన్ కు రైల్లో ప్రయాణించేవాడు. మొదటి భార్య చనిపోయిన ఏడేళ్ల తర్వాత జిల్ రాకతో బైడెన్ జీవితం మళ్లీ గాడినపడింది. 1979లో స్కూల్ టీచర్ గా పనిచేస్తోన్న జిల్ ను బైడెన్ వివాహం చేసుకున్నారు. వారికి ఆస్లా అనే కూతురుంది. ‘‘శిధిలమైన నా జీవితాన్ని మళ్లీ నిర్మించడంతోపాటు దాన్ని నందనవనంగా మార్చేసింది జిల్'' అని బైడెన్ పదే పదే చెబుతుంటారు. ఇక ఫస్ట్ లేడీ రేసు విషయానికొస్తే..

 జిల్, మెలానియాలో ఎవరు బెస్ట్..

జిల్, మెలానియాలో ఎవరు బెస్ట్..

అమెరికా ప్రధమ మహిళగా బాధ్యతలు నిర్వహిచడం మెలానియా కు అసలు ఇష్టమే లేదని, అందుకే ట్రంప్ అధ్యక్షుడైన ఐదు నెలల తర్వాతగానీ ఆమె న్యూయార్క్ ను వీడి వాషింగ్టన్ రాలేకపోయారని విమర్శకులు అంటుంటారు. ట్రంప్-మెలానియా వ్యక్తిగత జీవితంపైనా పుకార్లు వ్యాప్తిలో ఉన్నాయి. ఇక జిల్ బైడెన్ విషయానికొస్తే, భర్త జోబైడెన్ పై ఓ మహిళా ప్రొఫెసర్(అనితా హిల్) లైంగికదాడి ఆరోపణలు చేసిన సమయంలో జిల్ భర్తను వెనకేసుకొచ్చి విమర్శలపాలయ్యారు. మెలానియా ‘బీ బెస్ట్' పేరుతో సైబర్ క్రైమ్, డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమం చేపట్టారు. ఇక జిల్ బైడెన్ ‘బ్రెస్ట్ హెల్త్ ఇనిషియేటివ్' పేరుతో ఉచిత క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఫస్ట్ లేడీ పోస్టుకు ఎవరు బెస్ట్ అనే చర్చ ఇంకొద్ది గంటల్లో ముగియనుంది. మంగళవారం(నవంబర్ 3న) పోలింగ్ ముగిసిన వెంటనే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి...

రక్తపాతానికి బీజేపీ భారీ కుట్ర -మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన -సర్వత్రా టెన్షన్..రక్తపాతానికి బీజేపీ భారీ కుట్ర -మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన -సర్వత్రా టెన్షన్..

English summary
Acloser look at the wife of Joe Biden and the wife of President Trump. Two very different presidential candidates supported by two very different women. Jill Biden and Melania Trump, both hoping their husbands will assume the title of president come Nov. 3, but going about it in different fashions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X