టర్బన్ తొలగించి, జుత్తు కత్తిరించి: అమెరికాలో సిక్కు వ్యక్తిపై దాడి
వాషింగ్టన్: అమెరికాలో సిక్కు వ్యక్తి పైన దాడి జరిగింది. కొందరు వ్యక్తులు మన్ సింగ్ ఖల్సా అనే వ్యక్తిని రిచ్‌మండ్ వద్ద అడ్డగించి, అతని టర్బన్ తొలగించి, అతని వెంట్రుకలను కత్తిరించారు. తొలుత, అతని పైన దాడి చేసిన గ్రూపులోని ఓ వ్యక్తి ఖల్సా కారు పైనకి ఓ బీరు సీసా విసిరివేశాడు.
ఆ తర్వాత ఖల్సా తలను అతని కారు నుంచి బలవంతంగా బయటకు లాగి, అతని టర్బన్ తొలగించారు. ఆ తర్వాత అతని వెంట్రుకలను కత్తిరించారని చెబుతున్నారు. ఈ సంఘటన సెప్టెంబర్ నెలలో జరిగింది. బాధితుడికి గాయాలు అయ్యాయి.
దీనిపై సిక్కు సంస్థ న్యాయం కావాలని కోరింది. దాడి నేపథ్యంలో కేసు ఫైల్ చేయాలని కాలిఫోర్నియా లా ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులను కోరింది. మన్ సింగ్ ఖల్సా ఇన్‍ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ అని, అతని పైన రేసియల్ దాడి జరిగిందని చెప్పారు.

ఖల్సా తన మతపరమైన ఆచారంలో భాగంగా టర్బన్ ధరిస్తారు. పొడువైన జుత్తు పెంచుకుంటారు. ఇతను కాలిఫోర్నియాలో ఐటీ స్పెషలిస్ట్. అతను సెప్టెంబర్ 25వ తేదీన కారులో ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.
నిందితులు తన పైన ఉద్దేశ్య పూర్వకంగా దాడి చేసి గాయపరిచారని, తన సిక్కు విశ్వాసాన్ని టార్గెట్ చేశారని మన్ సింగ్ ఖల్సా ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను టార్గెట్ చేసినప్పుడు ఐదారుగురు తెల్లవారు ఉన్నారని చెప్పారు. వారి వయస్సు 20 నుంచి 30 వరకు ఉంటుందని చెప్పారు.
సిక్కులకు చెందిన ఓ సంస్థ.. ఖల్సా విషయమై రిచ్‌మండ్ పోలీస్ డిపార్టుమెంట్,క కోంట్రా కోస్టా కంట్రీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయానికి దాడి విషయమై లేఖ కూడా రాశారు. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించాలని విజ్ఞప్తి చేశారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications