వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: మాడిసన్ స్క్వేర్ వద్ద రాజీవ్ సర్దేశాయ్‌పై దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: భారత్‌లో ప్రముఖ టీవీ యాంకర్‌, వ్యాఖ్యాత, సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ మీద అమెరికాలో దాడి జరిగింది. మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌ బయట కొంత మంది ఆదివారం ఆయనపై దాడి చేశారు. రాజ్‌దీప్‌పై దాడి చేసిన వారు ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుదారులుగా భావిస్తున్నారు.

రాజ్‌దీప్‌ గతంలో మోడీని విమర్శించినందుకే ఈ దాడి అని ట్విటర్‌లో పలు ట్వీట్‌లు దర్శనమిచ్చాయి. ఈ ఏడాది జూలైలో ఐబీఎన్‌ 18 నుంచి ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా రాజీనామా చేసిన రాజ్‌దీప్‌ - ‘‘మాడిసన్ స్క్వేర్ వద్ద భారీ సమూహం, ఇంకా కొంత మంది పనికిమాలిన వాళ్లు (ఇడియట్స్‌), దాడి చేయడమే మగతనానికి చిహ్నంగా భావిస్తున్నారు'' అని ట్వీట్‌ చేశారు.

Rajdeep Sardesai manhandled outside Madison Square Garden ahead of Modi address

అయితే, ఆయనపై దాడిని కెమెరాల్లో బంధించడంతో, ఆ వీడియోలు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో హల్‌చల్‌ చేశాయి. కెమెరాలో ఆ ఇడియట్స్‌ను బంధించినందుకు సంతోషమని, వాటిని చూపించడమే వారిని సిగ్గుపడేలా చేయడమని ఆయన వ్యాఖ్యానించారు.

<center><iframe width="100%" height="510" src="//www.youtube.com/embed/U9Totdio05s" frameborder="0" allowfullscreen></iframe></center>

తన పుస్తకానికి ఎనలేని ప్రచారం లభించిందని, సెల్పీలు తీసుకున్న వారంతా తన పుస్తకం కొంటామని హామీ ఇచ్చారని కూడా ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

English summary
Senior Indian journalist Rajdeep Sardesai was manhandled outside Madison Square Garden in New York on Sunday by some people who had reportedly assembled for Prime Minister Narendra Modi’s address.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X