వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాప్ ర్యాపర్ కాల్చివేత: గర్ల్‌ఫ్రెండ్‌తో..అపార్ట్‌మెంట్‌లో: షాక్‌లో ఫ్యాన్స్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పేట్రేగింది. మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ మధ్యకాలంలో వరుసగా ఇలాంటి దిగ్భ్రాంతిక సంఘటనలు చోటు చేసుకుంటూనే వస్తోన్నాయి. టెక్సాస్‌లోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలో సంభవించిన కాల్పులు ఉదంతంలో 21 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఉదంతం నుంచి తేరుకునే లోపే ఓక్లహామాలో ఓ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనే సంభవించింది. ఓక్లహామాలోని టుల్సా ఆసుపత్రిలో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు.

కఠిన నిర్ణయాలు తీసుకున్నా..

కఠిన నిర్ణయాలు తీసుకున్నా..

ఈ ఏడాదిలో టుల్సా కాల్పుల ఘటన 233వది కావడం అక్కడి పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది. గన్ వయోలెన్స్ ఆర్కైవ్స్ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. దీని తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. దేశంలో హై కెపాసిటీ బుల్లెట్ మేగజైన్లను నిషేధించనున్నట్లు తెలిపారు. అస్సాల్ట్ వెపన్లకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపారు. ఇకపై దేశంలో అస్సాల్ట్ వెపన్స్, హైకెపాసిటీ బుల్లెట్ మేగజైన్లు సాధారణ పౌరుల కోసం అందుబాటులో ఉండవని అన్నారు. ప్రభుత్వ విభాగాలు, అధికారులు మాత్రమే పరిమితంగా వాటిని వినియోగించేలా చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు.

ర్యాపర్ కాల్చివేత..

అయినప్పటికీ- అక్కడి తుపాకీ సంస్కృతికి కాస్తయినా తెరపడనట్టే కనిపిస్తోంది. తాజాగా టాప్ ర్యాపర్ కాల్చివేతకు గురయ్యాడు. అట్లాంటా తూర్పు ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. ఆయన పేరు ట్రబుల్ (Rapper Trouble). అసలు పేరు మ్యారియల్ సెమొంటో ఒర్ర్. తన స్నేహితురాలిని కలుసుకోవడానికి అట్లాంటా తూర్పు ప్రాంతంలో రాక్‌డేల్ కంట్రీలోని ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన సంభవించింది.

దూసుకెళ్లిన బుల్లెట్లు..

దూసుకెళ్లిన బుల్లెట్లు..

అమెరికా కాలమానం ప్రకారం.. తెల్లవారు జామున 3:20 నిమిషాలకు రక్తపు మడుగులో పడివున్న ర్యాపర్ ట్రబుల్‌ను గుర్తించారు. ర్యాపర్ ట్రబుల్ ఛాతీపై బుల్లెట్లు దూసుకెళ్లాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

 జోన్స్‌పై అనుమానాలు..

జోన్స్‌పై అనుమానాలు..

జమైఖెల్ జోన్స్ అనే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ర్యాపర్ ట్రబుల్‌తో జోన్స్‌కు ఎలాంటి ముఖ పరిచయం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. అతని స్నేహితురాలితో జోన్స్‌కు పరిచయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. వ్యక్తిగత మనస్పర్థలు, కుటుంబ వివాదాల వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నామని రాక్‌డేల్ కంట్రీ షెరిఫ్ ఆఫీస్ పీఆర్ఓ జెదీదియా క్యాంటీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తోన్న జేమ్స్‌పై ఇదివరకే పలు కేసులు నమోదయ్యాయని చెప్పారు.

షాక్‌లో అభిమానులు..

షాక్‌లో అభిమానులు..


కాగా- ర్యాపర్ ట్రబుల్ కాల్చివేత పట్ల ఆయన అభిమానులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. 2016లో యంగ్ థగ్స్ పేరుతో ర్యాప్ గ్రూప్‌ను నెలకొల్పారు. థీఫ్ ఇన్ ద నైట్ మోస్ట్ పాపుల్ ర్యాప్ సాంగ్‌గా పేరు తెచ్చుకుంది. స్లైమ్ సీజన్ 2 కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. యంగ్ థగ్స్‌తో పాటు డ్రేక్, గుక్కి మనె, 2 ఛైన్జ్.. వంటి గ్రూప్స్‌తో ఆయన అసోసియేటై ఉన్నారు.

English summary
Trouble, whose real name was Mariel Semonte Orr, was shot at an apartment east of Atlanta while visiting a female friend, according to a Rockdale County Sheriff’s spokesman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X