WTC Final 2023 : ఆస్ట్రేలియానే క్లియర్ ఫేవరెట్...! రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 7 నుంచి 11 మధ్య లండన్ లోని ఓవల్ మైదానంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగబోతోంది. అసలే పదేళ్లుగా టోర్నీ టైటిల్ కోసం భారత్ నిరీక్షణ సాగుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరుదేశాలతో పాటు ప్రపంచంలో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతోపాటే ఈ మ్యాచ్ పై అంచనాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిచేది ఎవరన్న దానిపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు తమదైన విశ్లేషణలు చేస్తున్నారు.
గతంలో 2013లో మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలోని భారత టెస్టు జట్టు డబ్ల్యూటీసీ ఛాంపియన్ షిప్ గెల్చుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకూ భారత్ కు నిరీక్షణ తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఓవల్ మైదానంలో జరిగే మ్యాచ్ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ పెరుగుతోంది. దీనిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఫేవరెట్ ఆస్ట్రేలియా జట్టేనని రవిశాస్త్రి కూడా పరోక్షంగా అంగీకరించాడు.

రెండు సంవత్సరాల క్రితం WTC ఫైనల్ ఓటమి సమయంలో టీమిండియా కోచ్ గా ఉన్న రవిశాస్త్రి తాజాగా ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ పై తనదైన విశ్లేషణ చేశాడు. ఈ ప్రతిష్ట్మాత్మక టైటిల్ కోసం సాగుతున్న నిరీక్షణను ముగించే సామర్థ్యం ప్రస్తుత భారత జట్టుకు ఉందని రవిశాస్త్రి తెలిపాడు. అయితే ఓ టెస్ట్ లో స్పష్టమైన ఫేవరెట్‌లు కూడా ఉండదని పేర్కొన్నాడు. పోటీలో ఉన్న జట్లకు కొంచెం అదృష్టం కూడా అవసరమని రవిశాస్త్రి తెలిపాడు.
టీమిండియా మంచి క్రికెట్ ఆడలేదని చెప్పనని, చాలా బాగా ఆడామని, కానీ పచ్చని పిచ్ లు వారికి ఎదురు కాలేదని రవిశాస్త్ర తెలిపాడు. ICC ట్రోఫీని గెలవడానికి ఈ జట్టు సరిపోతుందని తానెప్పుడూ చెబుతానని, కోచ్ గా ఉన్నప్పుడు కూడా అదే చెప్పేవాడినని శాస్త్రి గుర్తుచేశాడు. ముఖ్యంగా గత 3-4 ఏళ్లలో ఐసీసీ ట్రోఫీని గెలవడానికి ఈ జట్టు సరిపోతుందని అనుకున్నానని, ఇప్పటికీ ఆ ఆటగాళ్లు జట్టులో ఉన్నారన్నాడు. ఇంగ్లండ్‌లో ఆడుతున్నందున ఆస్ట్రేలియా స్పష్టమైన ఫేవరెట్ అని అందరూ అంటున్నారని, కానీ ఇది ఒకే ఒక్క టెస్టు, కేవలం ఒక్క చెడ్డ రోజు మీ అవకాశాలను నాశనం చేస్తుందని టీమిండియాకు గుర్తుచేశాడు. ఆస్ట్రేలియా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు.












Click it and Unblock the Notifications