హిందూ గుడిని తిరిగి నిర్మించండి: పాక్‌కు సుప్రీం

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని కరాత్ జిల్లాలోని ఖైబర్ పఖ్తున్ఖ్వ ప్రాంతంలో నేలకూల్చిన హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించాలని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు చీప్ జస్టిస్ జవాద్ ఎస్ ఖావాజా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తీర్పిచ్చిందని 'డాన్' పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

హోంశాఖ కార్యదర్శి అరబ్ మహమ్మద్ ఆరిఫ్, పీఎంఎల్-ఎన్ ఎంఎన్ఎ పార్టీ నేత రమేష్ కుమార్ వాంక్వానీ, కరాక్ డిప్యూటీ కమిషనర్ షోయబ్ జాదూన్‌లు కలసి చర్చించి శ్రీ పరమహంస జీ మహరాజ్ దేవాలయాన్ని తిరిగి కట్టే విషయమై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు అదేశించింది.

Rebuild Hindu temple: Pakistan's Supreme Court

ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ దేవాలయాన్ని తిరిగి పునర్నిర్మించాలని తేల్చి చెప్పింది. ఈ దేవాలయాన్ని పునర్నిర్మించానికి లాహోర్ మార్కెట్లో చుట్టుపక్కల ప్రాంతాలు దెబ్బతినకుండా దేవాలయాన్ని పునర్నిర్మించిన ఆర్కిటెక్చర్ కమిల్ ఖాన్ సలహాలు తీసుకోవాలని సూచించింది.

కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 7కు వాయిదా వేస్తూ, ఈ లోగా దేవాలయ వివరాలను తెలియజేయాలని అదేశించింది. 1919లో శ్రీ పరమహంస మరణించిన ఈ స్ధలంలో ఆయన శిష్యులు మందిరం నిర్మించగా, 1997 వరకూ అక్కడ పూజలు జరిగాయి. ఆ తర్వాత దేవాలయాన్ని కూల్చేయగా, స్థానిక ముఫ్తీ ఇఫ్తికారుద్దీన్ ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+