వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెలెన్​స్కీతో బైడెన్ మంతనాలు - మద్దతుపై హామీ : రష్యాను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పైన రష్యా యుద్దం కొనసాగుతున్న వేళ.. రోజురోజుకీ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త డిమాండ్లు తెర పైకి వస్తున్నాయి. అనేక ఆంక్షలు..ఒత్తిళ్లు వచ్చినా రష్యా యుద్దంలో వెనుకడుగు వేసేది లేదని చెబుతూనే కొంద సడలింపు ధోరణి ప్రదర్శిస్తోంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ సైతం ఒక వైపు ప్రతిఘటిస్తూనే మరో వైపు రష్యా వ్యతిరేక దేశాల మద్దతు కోరుకోతంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులపై సంభాషించారు. ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా మద్దతు ఉంటుందని బైడెన్​ చెప్పారు.

ఇప్పటికే ఉక్రెయిన్ భద్రత కోసం 1 బిలియన్ డాలర్లను కేటాయించినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ బ్రిటన్‌ పార్లమెంటును ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. ఆయనకు బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు నిలబడి కరతాళ ధ్వనులతో ఆయనకు సంఘీభావం ప్రకటించారు. రష్యా తమపై చేస్తున్న యుద్ధాన్ని తిప్పికొట్టేందుకు చివరి వరకు పోరాటం చేస్తామని జెలెన్‌ స్కీ స్పష్టం చేశారు. తాము ఎప్పటికీ లొంగబోమని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను ఉగ్రవాద దేశంగా గుర్తించాలని కోరారు. ఉక్రెయిన్‌ గగనతలం సురక్షితంగా ఉండేలా రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని బ్రిటన్‌ పార్లమెంటుకు ఆయన విజ్ఞప్తి చేశారు. బ్రిటన్‌, ఇతర ఐరోపా దేశాలు తమకు సాయం చేయాలని జెలెన్‌స్కీ అభ్యర్ధించారు.

recognise the Russia as a terrorist state, Ukrainian President Zelenskyy addresses Britains Parliament

Recommended Video

Russia Ukraine Conflict : I'm Not Hiding In A Bunker Like Putin - Zelenskyy | Oneindia Telugu

ఇదే సమయంలో రష్యా పైన అమెరికా మరిన్ని ఆంక్షలను పెంచింది. ష్యా నుంచి చమురు, సహజ వాయువు, బొగ్గు దిగుమతులను నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. రష్యా ఇంధన దిగుమతుల పైన ఆంక్షల విషయంలో యూరోపియన్ దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రష్యా ఇంధనంపై అమెరికా చాలా తక్కువ మోతాదులో ఆధారపడి ఉంది. 2021లో దాదాపు 8 శాతం దిగుమతి చేసుకోగా.. అందులో కేవలం 3 శాతం మాత్రమే ముడి చమురు ఉంది. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం తాము ఎప్పటికీ లొంగబోమని తేల్చిచెప్పారు. ఓడబోమని కూడా స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ను నాటోలో చేర్చాలనే ప్రతిపాదన పైన తాజాగా జెలెన్​స్కీ ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. దీని కోసం తాము పదే పదే అభ్యర్ధించటం సరి కాదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా సమాచారం. ఉక్రెయిన్ పై దాడి ప్రారంభించే సమయంలో రష్యా చేసిన తొలి డిమాండ్ సైతం..నాటో సభ్యత్వం ఉక్రెయిన్ కు దక్కకూడదనే డిమాండ్ చేసింది.

English summary
Ukrainian President Zelenskyy addresses Britain's Parliament asked to recognise the Russia as a terrorist state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X