ఇదెక్కడి స్కాండల్ రా మామా: 1600 మందితో శృంగారం..!!
Red Uncle Scandal: చైనాలోని నాన్జింగ్‌కు చెందిన 38 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జియావో అనే పేరుతో మాత్రమే గుర్తించబడిన ఇతను, ఒక మహిళగా నటిస్తూ 1000 మందికి పైగా పురుషులతో జరిపిన శృంగార సంబంధాలను రహస్యంగా చిత్రీకరించాడు. విగ్గులు, భారీ మేకప్, పొడవైన స్కర్టులు ధరించి, స్త్రీలా కనిపించేందుకు ప్రయత్నించడమే కాదు ఇతర మగాళ్లను అలా పడేశాడు. అతను తన గొంతును కూడా మార్చి పురుషులను నమ్మించేవాడు. ఇతగాడిని నమ్మిన చాలా మంది మోసపోయారు. అంతేకాదు ఏకంగా స్త్రీతోనే శృంగారంలో పాల్గొంటున్నామనే భ్రమలో ఉండేవారు.జియావో ఈ సంబంధాల కోసం డబ్బులు తీసుకోకపోయినా, పండ్లు, పాలు వంటి చిన్న బహుమతులు తీసుకునేవాడు. ఇది మరింత విచిత్రంగా ఉంది.
వీడియోల లీక్‌తో వెలుగులోకి..
జియావో తన అతిథులకు తెలియకుండా తన ఇంట్లో రహస్యంగా కెమెరాలు అమర్చాడు. వారి అనుమతి లేకుండానే వారి ప్రైవసీ లైఫ్‌ను రికార్డ్ చేశాడు. ఆ తర్వాత, ఆ వీడియో క్లిప్‌లను ఒక్కోదాన్ని 150 యువాన్‌లు లేదా 21 డాలర్లకు ఆన్‌లైన్‌లో అమ్మాడు. బాధితుల వివరాలు తెలియకుండానే వారిని దోచుకున్నాడు.ఆ తర్వాత కొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. వాటిలో తమను తాము గుర్తించిన కొంతమంది బాధితులు ఈ విషయం బయటకు తీసుకొచ్చారు. ఈ వీడియోలు చైనా సోషల్ మీడియా వేదిక అయిన వీబోలో వైరల్ అయ్యాయి. చాలా మంది బాధితులు తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల ద్వారా గుర్తించబడడంతో తీవ్ర వేదనకు గురయ్యారు.

చైనాలో తీవ్రమైన నేరంగా...
జియావోను పోలీసులు అశ్లీలతను వ్యాప్తి చేసిన ఆరోపణలపై అరెస్ట్ చేశారు. చైనా చట్టం ప్రకారం ఇది ఒక తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఈ వ్యవహారం ఎంత పెద్దదిగా ఉందో, దాని చట్టపరమైన పరిణామాలు ఏమిటో తెలుసుకోవడానికి పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.ఈ కేసులో అనేక శృంగార సంబంధాలు ఉండటంతో ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.బాధితులైతే వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే మానసిక కౌన్సిలింగ్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మొత్తానికి వెలుగు చూసిన ఈ సంఘటన టెక్నాలజీని ఉపయోగించి ఒక వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ లైఫ్‌ను ఎలా బద్నాం చేయొచ్చో మరోసారి రుజువైంది. ఈ ఘటన చైనా దేశవ్యాప్తంగా సంచలనం అవగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.దుర్బలమైన వ్యక్తులపై సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చనే దానికి ఇది ఒక ఉదాహరణ.












Click it and Unblock the Notifications