వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: 221 మంది స్త్రీలు, బాలికలపై సూడాన్ సైన్యం గ్యాంగ్ రేప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

సూడాన్: సూడాన్ దేశంలోని దార్ఫూర్ గ్రామంలో ఆ దేశ సైన్యం 221 మంది మహిళలు, బాలికల పైన గత ఏడాది సామూహిక అత్యాచారం జరిపిందట! ఈ దారుణ విషయం తమ దర్యాఫ్తులో హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్ఆర్డబ్ల్యూ) బుధవారం తెలిపింది.

అక్రమంగా ఇళ్లలోకి చొరబడ్డ సైనికులు పురుషులను నిర్బంధించి.. మహిళలు, బాలికల పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి హెచ్ఆర్‌డబ్ల్యూ 48 పేజీల నివేదిక పేర్కొంది.

 Report: Sudanese forces rape 221 women, girls in mass attack

ఇటలీలో గడ్డకట్టే చలికి

మధ్యధరా సముద్రంలో తాజాగా సంభవించిన దుర్ఘటనలో రక్తం గడ్డకట్టే చలి కారణంగా దాదాపు 200 మంది మృతి చెందారని, ఇంకా ఎంతో చనిపోయి ఉండే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన సహాయక ఏజన్సీ తెలిపింది. మరో రబ్బరు బోటు జాడ తెలియడంలేదని ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్న కొంతమంది చెప్పారని, అందువల్ల మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని ఆ ఏజన్సీ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

కనీసం 203 మందిని సముద్రపు అలలు మింగేసాయని ఇటలీలో ఐక్యరాజ్య సమితి సహాయక ఏజన్సీ ప్రతినిధి కార్లొట్టా సమీ తెలిపారు. ఉత్తర ఆఫ్రికానుంచి ఇటలీ తీరానికి ప్రయాణిస్తూ 29 మంది శరీరంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయి చలికి గడ్డకట్టుకుని చనిపోయినట్లు ఈ వారం ప్రారంభంలో ఇటలీ కోస్ట్‌గార్డు తెలిపింది.

English summary
Sudanese army troops raped at least 221 women and girls in a Darfur village in a series of organized, house-to-house attacks last year, Human Rights Watch said in a report released Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X