600 మందితో మధ్యదరాలో పడవ మునక, ఒకవైపు రావడంవల్లే!

లిబియా: లిబియాలో పడవ మునిగింది. ఈ ఘటనలో 26 మంది వరకు మృతి చెందారు. మరో వందలాది మంది గల్లంతయ్యారని సమాచారం. ఈ ప్రమాదంలో వందల మంది చనిపోయి ఉంటారని కూడా వార్తలు వస్తున్నాయి.

మధ్యదరా సముద్రంలో పడవ మునిగింది. వీరు వలసకు వెళ్తున్న వారు. యూఎన్‌హెచ్ఆర్సీ అధికారులు ట్విట్టర్‌లో పేర్కొన్న ప్రకారం.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 399 మందిని రక్షించారు. 25 మంది మృతి చెందినట్లుగా చెప్పారు.

Rescue hopes fade for migrants after boat capsizes in Mediterranean

పడవలో ఆరువందల మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో వంద మంది వరకు మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. పడవలో ప్రయాణిస్తున్న వారంతా ఒక వైపు రావడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ పడవ మునక ప్రమాదం లిబియా తీరానికి పదిహేను మైళ్ల దూరంలో జరిగింది.

ఇదిలా ఉండగా, మధ్యదరా సముద్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 2000 మంది వరకు ఇలాంటి ప్రమాదాల వల్ల మరణించి ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుత ప్రమాదం బుధవారం నాడు జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+