
శారీరక సౌందర్యం వర్ణిస్తూ, ప్రియురాలిని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు, ఎందుకంటే?
లండన్: బ్రిటన్‌లో ఓ విస్తుపోయే సంఘటన చోటు చేసుకుంది. ప్రియురాలి పైన ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ ప్రియుడు ఏకంగా ఆమె ఫోటోను ఆన్‌లైన్‌లో పెట్టి అమ్మకానికి పెట్టాడు. ఈ వింత సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
డేల్ లీక్స్, కెల్లీ గ్రీవ్స్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. కొద్ది రోజులకు వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. ఈ కారణంగా ప్రియురాలు కెల్లి ప్రియుడి డేల్‌ను ఓసారి కొట్టింది. అప్పటి నుంచి అతను ఆమెపై రగిలిపోతున్నాడు.
యూజర్లకు 'అల్బాబెట్' షాక్, గూగుల్ ప్లస్ మూసివేత: కారణాలు ఇవే

ప్రియురాలికి బుద్ధి చెప్పాలనుకొని
ప్రియురాలు కెల్లీకి గట్టిగా బుద్ధి చెప్పాలని డేల్ అనుకున్నాడు. వెంటనే అతనికి ఓ ఆలోచన వచ్చింది. దానిని అమలు చేశాడు. ఈ కామర్స్ సైట్ ఈబేలో ఆమెను అమ్ముతున్నట్లు ఓ ప్రకటన ఇచ్చాడు. అంతేకాదు, ఆమె గురించి అందులో వర్ణించాడు.

ఆమె ప్రవర్తన, శారీరక సౌందర్యం గురించి వర్ణన
ఆమె ప్రవర్తన, శారీరక సౌందర్యం గురించి ఆ ప్రకటనలో ప్రియుడు వర్ణించాడు. ఏదో ఆషామాషీగా పెట్టిన ఆ ప్రకటనకు ఒక్క రోజులోనే బాగా స్పందన వచ్చింది. దాన్ని 81 వేలమంది చూశారు. చివరకు ఓ వ్యక్తి అయితే రూ. 68లక్షలు చెల్లిస్తానని ముందుకు వచ్చాడు.
డ్రైవ్‌కు తీసుకు వెళ్తామని ఫోన్లు
కెల్లీని ఓసారి డ్రైవ్‌కు తీసుకు వెళ్తామని అతడికి పెద్ద ఎత్తున ఫోన్లు వచ్చాయి. మెసేజ్‌లు కూడా వచ్చాయి. అతడు ఆమెను అవమానించడానికి పెడితే, దానికి అనూహ్య స్పందన వచ్చింది. వరుస ఫోన్లు, సందేశాలతో అతనికి షాక్ తగిలింది.

యాడ్ తొలగించిన ఈబే
ఇదిలా ఉండగా, ఈబే విషయం తెలియగానే వెంటనే ఆ యాడ్‌ను తొలగించింది. మానవ శరీరాన్ని, ఇతర భాగాలను అమ్మడానికి తమ వెబ్‌సైట్ అనుమతించదని తెలిపింది. చాలామంది నెటిజన్లు దీనిని నేరంగా పేర్కొన్నారు.