వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిషి సునక్: బ్రిటన్ కొత్త ప్రధానిగా కొలువుదీరడం దాదాపు ఖాయం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రిషి సునక్, లిజ్ ట్రస్

ప్రధాని రేసులో సెప్టెంబర్‌లో వెనకబడిన వ్యక్తి, అక్టోబర్‌లో బరిలోకి దిగారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో రిషి సునక్ కు మార్గం సుగమం అయింది.

కొత్త ప్రధాని కాబోయే వ్యక్తిగా రిషి సునక్ ముందు వరుసలో కనిపిస్తున్నారు. పెన్నీ మోర్డంట్ ప్రస్తుతం తనకు మద్ధతిచ్చిన వారికంటే ఇంకా అనేక రెట్లమందిని తనవైపు ఉన్నారని నిరూపించుకోవాల్సి ఉంది.

ఈ విషయంలో ఆమె విఫలమైతే, రిషి సునక్ ప్రధానమంత్రి కావడం లాంఛన ప్రాయమే. ఏది ఏమైనా ఈ వారాంతకల్లా కొత్త ప్రధాని కొలువుదీరడం ఖాయం.

అదే జరిగితే, కొత్తగా వచ్చిన యూకే ప్రైమ్ మినిస్టర్ ఏడు వారాల్లో మూడో వ్యక్తి అవుతాడు.

కన్జర్వేటివ్ పార్టీ

అస్థిరత, ఆందోళన

ఇది బ్రిటన్‌లో ఇంతకు ముందెన్నడూ కనిపించని అస్థిర కాలం. చాలామంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు కూడా ప్రైవేట్ సంభాషణలో దీన్ని అంగీకరిస్తున్నారు. ఇలాంటి సర్కస్ ఫీట్ల వల్ల పార్టీ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిందని పార్టీ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఈ రాజకీయ కోలాహలాన్ని కవర్ చేసే అవకాశం పొందిన జర్నలిస్టులందరికీ ఈ వారాంతంలో ఏం జరుగుతుందో తెలుసు. అయితే, వెస్ట్‌మిన్‌స్టర్‌లోని ప్రజలు 'బోరిస్ జాన్సన్ ఏం చేయబోతున్నారు' అని అడగడం ఇదే మొదటిసారి కాదు.

కరేబియన్ దీవులకు వెళ్లిన బోరిస్ జాన్సన్ తిరిగి వచ్చారు. శనివారం-ఆదివారం ఫోన్ ద్వారా ఎంపీల మానసిక స్థితిని అంచనా వేయడానికి ప్రయత్నించారు.

కొన్ని వారాల కిందట, ఆ ఎంపీలే బోరిస్ జాన్సన్‌ను రాజీనామా చేయమని బలవంతం చేశారు. మారిన పరిస్థితుల్లో తనపై తన పార్టీ ఎంపీల వైఖరిలో మార్పు వచ్చిందో లేదో తెలుసుకోవాలనుకున్నారు జాన్సన్.

శనివారం మధ్యాహ్నం వరకు తమకు తగినంత సంఖ్యలో ఎంపీల మద్ధతు ఉందని ఆయన బృందం చెబుతూ వచ్చింది. బ్రిటన్ క్యాబినెట్ మంత్రి జాకబ్ రీస్-మోగ్ ఈ విషయాన్ని బహిరంగంగా పేర్కొన్నారు.

మరో మంత్రి క్రిస్ హీటన్-హారిస్ మరింత ముందుకు వెళ్లారు. బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా చెప్పుకోవడానికి అవసరమైన పేపర్ వర్క్ చేసి పార్టీ ముందు ఉంచారని ఆయన పేర్కొన్నారు.

దీంతో ఆయన ఆ పదవి రేసులో ఉన్నట్లు స్పష్టంగా అర్థమైంది.

బోరిస్ జాన్సన్

ఈ మాటలన్నింటినిబట్టి చూసినప్పుడు, ఒకవేళ బోరిస్ జాన్సన్ తిరిగి పదవిలోకి వస్తే, ఆయన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

వాస్తవానికి ఆయన సన్నిహితులు చాలామంది కూడా ఆయన మాటలను నమ్మే పరిస్థితి లేదు.

కోవిడ్ పార్టీ గురించి పార్లమెంటులో బోరిస్ జాన్సన్ విచారణను ఎదుర్కోకపోయి ఉంటే, పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేదని, ఒక ఎంపీ ప్రైవేటు సంభాషణలో చెప్పారు.

ఆయనపై విచారణ జరగకపోయి ఉంటే మరోసారి ప్రధాని పదవి రేసులో సులభంగా ఉండేవారని ఆ ఎంపీ అన్నారు.

కానీ, ఆదివారం నాటికి పరిస్థితి మారింది.

ఆయనకు మద్దతిచ్చేవారు సరిపడినంత మంది లేకపోవడం వల్ల ఆయన బరి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.

https://twitter.com/ANI/status/1584283940118220801

కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో మూడో వంతు మందిని కూడా బోరిస్ తనవైపు నిలబెట్టుకోలేకపోయారని తెలుస్తోంది. పార్టీ ఎంపీల అంగీకారం లేకుండా పోటీలో గెలిచినా.. తన గెలుపుకు అర్థం లేకుండా పోతుందని బోరిస్ జాన్సన్‌కు బాగా అర్థమైంది.

పార్లమెంటరీ పార్టీ మద్దతు లేకుండా ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వర్తించడం ఎంత కష్టమో ఆయనకు తెలుసు.

మరో మార్పు

అంటే బ్రిటన్‌లో మరోసారి అధికారంలో మార్పు జరగబోతోంది. బ్రిటన్ కింగ్ చార్లెస్ III సోమవారం సాయంత్రం వరకు లండన్‌లో ఉంటారని నాకు తెలిసింది.

ఆయన ఒకవేళ నగరంలో లేకుంటే, ఈ మధ్యాహ్నమే రిషి సునక్ ఎన్నికైనా, ఆయన ప్రధానమంత్రి సీట్లో కూర్చోవడానికి మంగళవారం వరకు వేచి ఉండాల్సి రావచ్చు.

అయితే, ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. పార్టీ నాయకుల మధ్య పోటీలో ఏం జరుగుతుందన్నది తేలాల్సి ఉంది.

కానీ, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గెలిచిన వ్యక్తి, ఇప్పటి వరకు లిజ్ ట్రస్ ఎదుర్కొన్న సమస్యలనే ఎదుర్కోవాల్సి ఉంటుంది.

నిలువునా చీలిపోయిన కన్జర్వేటివ్ పార్టీ, నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆందోళనకరమైన ఆర్థిక పరిస్థితి, తీవ్రమైన ప్రతిపక్ష దాడులు...వీటన్నింటినీ గెలిచిన వ్యక్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పెన్నీ మార్డాంట్

ఎన్నిక ఎలా జరుగుతుంది?

ప్రస్తుతం బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీకి మెజారిటీ ఉంది. బోరిస్ జాన్సన్ దిగిపోయిన తర్వాత లిజ్ ట్రస్ ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు పార్టీ మళ్లీ కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి వచ్చింది. ఎన్నికైన పార్టీ నాయకుడే తదుపరి ప్రధాని కూడా అవుతారు.

కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నిక కావాలంటే 100 మంది ఎంపీల సంతకాలు అవసరం. ఈ ప్రక్రియ పబ్లిక్ కాదు.

కన్జర్వేటివ్ పార్టీకి మొత్తం 357మంది సభ్యులు ఉన్నారు. అభ్యర్థులకు 100 చొప్పున నామినేషన్లు రావాలంటే ముగ్గురి కన్నా ఎక్కువమంది ఎన్నికల్లో నిల్చునే అవకాశం లేదు. ఇద్దరు లేదా ఒక్కరే నిల్చునే అవకాశం కూడా ఉంది. ఒక్కరే అయితే ఓటింగ్ అవసరమే ఉండదు.

ముందుగా ఇద్దరు కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు అభ్యర్థి పేరును ప్రతిపాదించాల్సి ఉంటుంది. మరో 98 మంది ఎంపీలు ఈ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాల్సి ఉంది. ఈ ఎంపీలు తమ పేర్లను గోప్యంగా ఉంచుకోవచ్చు.

ప్రస్తుతం ఇద్దరు నేతలు రిషి సునక్, పెన్నీ మార్డంట్‌లు అభ్యర్ధులుగా ఉన్నారు.

ముగ్గురు వ్యక్తులు బరిలో ఉంటే, వారిలో తక్కువమంది ఎంపీల ఓట్లు వచ్చిన వారిని బరిలో నుంచి తొలగిస్తారు. మిగిలిన ఇద్దరు అభ్యర్ధులకు ఎంపీలు తమ ప్రాధాన్య ఓట్లను వేస్తారు. ఈ ఓటింగ్ అంతా ఆన్‌లైన్‌లో జరుగుతుంది.

ఇందులో గెలిచిన వ్యక్తి పార్టీకి అధినేత అవుతారు. అతను/ఆమె ప్రధానమంత్రి కూడా అవుతారు.

భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు నామినేషన్ దాఖలు గడువు ముగుస్తుంది. ఒకరి కంటే ఎక్కువ మంది ఎంపీలు నామినేషన్ దాఖలు చేస్తే రాత్రి 8 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Rishi Sunak: It is almost certain that he will be the new Prime Minister of Britain
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X