వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం మత్తులో కోర్టుకు బయల్దేరిన మహిళా జడ్జీ

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: తప్పులు, నేరాలు చేసిన వారిని విచారించి వారికి శిక్షలు వేయాల్సిన స్థానంలో ఉన్న ఓ మహిళా న్యాయమూర్తి బాధ్యతారహితంగా ప్రవర్తించారు. ఫూటుగా మద్యం సేవించి కారులో కోర్టుకు వెళ్తుండగా, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో చోటు చేసుకుంది.

మహిళా న్యాయమూర్తి అయిన లెటిషియా అస్టాషియో(34)ను శనివారం ఉదయం న్యూయార్క్ స్టేట్ ట్రూపర్స్ అరెస్టు చేశారు. 2014లో జడ్జీగా నియమితురాలైన ఆమె తాగి వాహనం నడుపుతూ కోర్టుకు బయలుదేరింది.

 Rochester judge arrested for driving drunk on her way to court, prosecutor says

బ్రీత్ అనలైజర్‌తో పరీక్ష చేసేందుకు మొదట ఆమె నిరాకరించారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. క్రిమినల్‌ కోర్టులో ఆమె వాదనలు వినాల్సి ఉంది. తాగి వాహనం నడిపిన కేసులో నిందితురాలిగా ఆమె వచ్చే మార్చిలో కోర్టుకు హాజరుకానున్నారని మాన్రో కౌంటీ జిల్లా అటార్నీ అయిన సాండ్ర డూర్లే తెలిపారు.

అస్టాషియో అరెస్టు కావడంతో ఆమె స్థానంలో కొత్త న్యాయమూర్తిని నియమించినట్టు చెప్పారు. ఈ వ్యవహారంపై నిందితురాలైన అస్టాషియో కానీ, న్యూయార్క్ రాష్ట న్యాయస్థాన విభాగంకానీ ఇంతవరకు స్పందించలేదు.

English summary
A Rochester judge was arrested Saturday morning on a drunken driving charge after being pulled over on her way to court, authorities said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X