స్కూల్‌లో ఆగంతకుడి కాల్పులు: 13 మంది మృతి, నిందితుడు ఆత్మహత్య
మాస్కో: సెంట్రల్ రష్యా సిటీ ఇజెవ్స్క్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దుండగుడు తుపాకీతో ఓ స్కూల్‌లో ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 13 మంది మృతి చెందారు. ఆ తర్వాత నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
దుండగుడి కాల్పుల్లో మరో 20 మందికిపైగా గాయపడ్డారని ఇంటీరియర్ మినిస్ట్రీ ఉద్మూర్తియా శాఖ వెల్లడించింది. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.

ఇజెవ్స్క్ రాజధానిగా ఉన్న ఉడ్ముర్టియా ప్రాంతానికి చెందిన గవర్నర్ అలెగ్జాండర్ బ్రెచలోవ్ మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి ఒక సెక్యూరిటీ గార్డును చంపాడని చెప్పారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం మృతులు, క్షతగాత్రుల్లో విద్యార్థులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications