Ukraine: ఉక్రెయిన్ నగరాలపై రష్యా మెరుపు దాడి.. 16 మంది మృతి..!
రష్యా ఉక్రెయిన్ నగరాలపై మరోసారి విరుచుకుపడింది. స్థానిక మీడియా అధికారుల ప్రకారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి మధ్య, దక్షిణ ప్రాంతాల గుండా శుక్రవారం తెల్లవారుజామున ఉక్రెయిన్ విస్తృతమైన నగరాలపై దాడి రష్యా సేనలు చేశాయి. ఈ దాడిలో 16 మంది మరణించినట్లు సమాచారం. ఇందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. మార్చి 9వ తేదీ తర్వాత కీవ్‌పై మాస్కో బలగాలు క్షిపణి దాడులు చేపట్టడం ఇదే మొదటిసారి.
ఉక్రెనియన్ దళాలు త్వరలో దాని మిత్రదేశాల నుంచి యుద్ధ ట్యాంకులతో సహా కొత్త సైనిక పరికరాలతో దాడిని ప్రారంభించాలని భావిస్తున్నందున నేపథ్యంలో రష్యా దళాలు దాడులు చేసినట్లు తెలుస్తోంది. సెంట్రల్ పట్టణంలోని ఉమాన్‌లో క్షిపణి అపార్ట్‌మెంట్ భవనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారని, ఆ ప్రాంతంలోని మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఇహోర్ టబురెట్స్ చెప్పారు.

సెంట్రల్ సిటీ డ్నిప్రోలో క్షిపణి ఒక ఇంటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక చిన్నారి, ఒక యువతి మరణించారని బోరిస్ ఫిలాటోవ్ మేయర్ టెలిగ్రామ్‌లో తెలిపారు. కీవ్ కూడా పేలుళ్లతో దద్దరిల్లింది. వైమానిక దాడి సైరన్లు, పేలుళ్లు దేశవ్యాప్తంగా జరిగాయి. కీవ్ ోప్రాంతంలోని ఉక్రెయింకా పట్టణంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. విమాన నిరోధక యూనిట్లు 11 క్షిపణులు, రెండు డ్రోన్‌లను నాశనం చేశాయని, శిధిలాలు విద్యుత్ లైన్‌ను దెబ్బతీశాయని ఉక్రెయిన్ సైన్యం తెలిపంది.
మధ్య ఉక్రెయిన్‌లోని డ్నిప్రో, క్రెమెన్‌చుక్, పోల్టావా, దక్షిణాన మైకోలైవ్‌లలో అర్ధరాత్రి తర్వాత పేలుళ్లు సంభవించాయని ఇంటర్‌ఫాక్స్ తెలిపింది. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, ఉక్రెనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్‌కీ మధ్య బుధవారం టెలిఫోన్ సంభాషణ జరిగింది. సంఘర్షణకు ముగింపు పలికే ఏదైనా దానిని స్వాగతిస్తామని క్రెమ్లిన్ చెప్పిన ఒక రోజు తర్వాత శుక్రవారం రష్యా దాడులు జరిగాయి.
గతేడాది ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత నేతలు మాట్లాడటం ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications