బరాక్ ఒబామా రాకపై నిషేధం: ఇక ఆ దేశంలో అడుగు పెట్టలేరు
మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య 15 నెలలుగా హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన యుద్ధానికి అంతు ఉండట్లేదు. ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. రష్యన్ సైనికులు సహా వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు.
ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

రష్యాకు అంత తేలిగ్గా తలవంచట్లేదు ఉక్రెయిన్. ఈ దాడులను ధీటుగా ఎదుర్కొంటోంది. రష్యా వశపరచుకున్న కొన్ని కీలక నగరాలను విడిపించుకోగలిగింది కూడా. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది.
పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది. ఇన్ని రోజులుగా వాటన్నింటినీ తట్టుకుని నిలిచింది. ఏ మాత్రం చలించట్లేదు. దౌత్య, ఆర్థిక, వాణిజ్య పరమైన అనేక ఆంక్షలను రష్యా ఎదుర్కొంటోంది. కొన్ని యూరప్ దేశాలు రష్యా నుంచి ముడిచమురును కొనుగోలు చేయడాన్ని కూడా నిలిపివేశాయి. ఆ దేశ విమానాలు రాకపోకలు సాగించకుండా తమ గగనతలాన్ని సైతం మూసివేశాయి.
ఈ పరిస్థితుల్లో అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది రష్యాపై. జీ7 దేశాధినేతలు, ప్రధానమంత్రుల సమావేశలో పాల్గొనడానికి జపాన్‌లోని హిరోషిమా వెళ్లిన జో బైడెన్ ఈ మేరకు ప్రకటన చేశారు. కొత్తగా 300 రకాల ఆంక్షలను విధించినట్లు వెల్లడించారు. రష్యా ప్రతినిధులు, ఆ దేశ వ్యాపార సంస్థలను వీటి పరిధిలోకి తీసుకొచ్చారు. రష్యన్ నౌకలు తమ దేశ జలాల్లో ప్రవేశించడంపై నిషేధాన్ని విధించినట్లు తెలిపారు.
ఈ పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. తమ దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. ఆయనతో పాటు మరో 500 మందిని నిషేధం పరిధిలోకి తీసుకొచ్చారు. జో బైడెన్ విధించిన తాజా ఆంక్షలకు ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ జాబితాలో అమెరికాకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. రాజకీయ, వాణిజ్య, ఆర్థిక రంగాలకు చెందిన వారిపై నిషేధం వర్తింపజేసింది. సెనెటర్లు, హౌస్ కాంగ్రెస్ సభ్యులు, మాజీ రాయబారులు, టెలివిజన్ హోస్ట్ స్టీఫెన్ కోల్బర్ట్, జిమ్మి కిమ్మెల్, సేథ్ మేయర్స్, మీడియా హౌస్ సీఎన్ఎన్ యాంకర్ ఎరిన్ బర్నెట్, న్యూస్ ఛానల్ ఎంఎస్ఎన్‌బీసీ ప్రజెంటర్ రాఛెల్ మాడ్డోవ్, జో స్కార్‌బోరో ఈ లిస్ట్‌లో ఉన్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications