Russia- Ukraine war: రష్యా ఖేల్ ఖతం.. 1000 కుపైగా డ్రోన్ లతో విధ్వంసం
రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య నాలుగేళ్లుగా యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ నుంచి వచ్చిన 800 కు పైగా డ్రోన్ లను తాము కూల్చేసినట్లు రష్యా ధ్రువీకరించింది. ఉక్రెయిన్ నుంచి రష్యా పై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటి అని స్పష్టం చేసింది. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్ నుంచి డ్రోన్ దాడులు ప్రారంభమైన నేపథ్యంలో రష్యా కూడా ప్రతీకార దాడులు చేపట్టింది. ఇక ఉక్రెయిన్ రష్యాలోని అనేక కీలక ప్రాంతాలపై భీకర దాడులు నిర్వహించింది. రష్యాలోని వేర్ హౌజ్ లు, ఇండస్ట్రీయల్ ప్లాంట్స్, రిఫైనరీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని రష్యాకు చెందిన టీఏఎస్ఎస్ న్యూస్ ధ్రువీకరించింది.
ఉక్రెయిన్ నుంచి ఈ రేంజ్ లో డ్రోన్ దాడులు జరగడం ఈ సంవత్సరంలో ఇదే తొలిసారి అని టీఏఎస్ఎస్ న్యూస్ వెల్లడించింది. ఈ మేరకు రష్యా రాజధాని మాస్కోలో డ్రోన్ దాడులు తీవ్రతరం అయ్యాయి. ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ యూనిట్స్ కలిసి మాస్కో ప్రాంతంలో దాదాపు 187 డ్రోన్ లను కూల్చివేశాయి. ఈ విషయాన్ని మాస్కో గవర్నర్ ఆండ్రీ ఓరోబీవ్ స్పష్టం చేశారు. అయితే మాస్కోలో జరిగిన భీకర దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు.

మరోవైపు గత ఐదేళ్లలో ఉక్రెయిన్.. మాస్కోపై చేసిన అతిపెద్ద వైమానిక దాడుల్లో ఇదొకటని రష్యా మీడియా కథనాలు స్పష్టం చేశాయి. ఇరు దేశాల మధ్య జరిగిన దాడుల్లో అనేక నివాస గృహాలు, దుకాణాలు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఇక బ్లాక్ సీ నౌకాదళానికి ప్రధాన స్థావరంగా ఉన్న పోర్టుపై జరిగిన దాడిలో నాలుగు రష్యా యుద్ధనౌకలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. వాటిలో రెండు ఫ్రిగేట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రష్యా- ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాల మధ్య ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications