Russia: నల్ల సముద్రంలో ప్రయాణించే ఓడలకు రష్యా హెచ్చరిక.. ఇక ఆహార సంక్షోభం తప్పదా..!
ఉక్రెయిన్ నల్ల సముద్రపు ఓడరేవులకు ప్రయాణించే నౌకలు సైనిక లక్ష్యాలుగా పరిగణించబడతాయని రష్యా హెచ్చరించింది. సైనిక లక్ష్యాలుగా మారితే వాటిని పేల్చేసే అవకాశం ఉంటుంది. ఉక్రెయిన్ ఓడరేవుల నుంచి ఆహార సరుకులను అనుమతించే ఒప్పందం నుంచి మాస్కో ఉపసంహరించుకున్న తర్వాత ధాన్యం ఎగుమతులను కొనసాగించడానికి తాత్కాలిక షిప్పింగ్ మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నౌక ప్రయాణాలాపై రష్యా హెచ్చరించింది.
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం నాడు, ఉక్రెయిన్‌కు ప్రయాణించే అన్ని నౌకలు కైవ్ తరపున సైనిక సరుకులను తీసుకువెళ్లే అవకాశం ఉందని "అటువంటి నౌకల జెండా దేశాలు ఉక్రెనియన్ సంఘర్షణలో పార్టీలుగా పరిగణించబడతాయి" అని బుధవారం తెలిపింది. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌పై ఒక ప్రకటనలో, రక్షణ మంత్రిత్వ శాఖ మాస్కో సమయం అర్ధరాత్రి నుంచి నల్ల సముద్రంలో నౌకల పట్ల తన కొత్త వైఖరిని అమలు చేస్తుందని తెలిపింది.

ఉక్రెయిన్‌కు వెళ్లే నౌకలపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. నల్ల సముద్రం అంతర్జాతీయ జలాల్లోని ఆగ్నేయ, వాయువ్య భాగాలను నావిగేషన్ కోసం తాత్కాలికంగా సురక్షితం కాదని రష్యా ప్రకటించింది. పొరుగున ఉన్న నల్ల సముద్ర దేశాల్లో ఒకటైన రొమేనియా మీదుగా తాత్కాలిక షిప్పింగ్ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఉక్రెయిన్ బుధవారం తెలిపింది.
నల్ల సముద్రంలోని పౌర నౌకలపై దాడి చేయాలని రష్యా పరిశీలిస్తోందని, ఆపై ఉక్రెనియన్ దళాలపై నిందలు వేయాలని భావిస్తోందని వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు ఆరోపించారు. రష్యా ఆహారాన్ని "యుద్ధ ఆయుధంగా" ఉపయోగిస్తోందని, యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చెప్పారు. మాస్కో వరుసగా రెండు రోజులు అంతర్జాతీయ జలాల్లో ఓడలపై బెదిరింపులు చేసిందని.. ఉక్రెనియన్ పోర్ట్ సిటీ ఒడెసాపై వరుసగా రెండు రాత్రులు దాడి చేసిందని పేర్కొన్నారు.
"నిజమైన అవసరం ఉన్న దేశాలకు సహాయం చేయడానికి బదులుగా, పశ్చిమ దేశాలు రాజకీయ బ్లాక్‌మెయిల్ కోసం ధాన్యం ఒప్పందాన్ని ఉపయోగించాయి మరియు ప్రపంచ ధాన్యాల మార్కెట్‌లో అంతర్జాతీయ సంస్థలు, స్పెక్యులేటర్‌లను సుసంపన్నం చేసే సాధనంగా మార్చాయి" అని ప్రభుత్వ సమావేశంలో పుతిన్ అన్నారు.












Click it and Unblock the Notifications