వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టు కోసం మిలిటెంట్లుXప్రభుత్వం: సిరియాలో వందలాది మంది సామాన్యులు బలి

|
Google Oneindia TeluguNews

Recommended Video

సిరియాలో వందలాది మంది సామాన్యులు బలి!!

వాషింగ్టన్/సిరియా: గత కొద్ది రోజులుగా సిరియాలోని గౌటా నగరంపై ప్రభుత్వ దళాల దాడుల్లో వందలాది మంది పౌరులు ప్రాణాలు విడిచారు. చనిపోయిన వారిలో చిన్నారులు, మహిళలు ఉన్నారు. వైమానిక దాడుల్లో ఆసుపత్రి భవనాలు, వందలకొద్ది ఇళ్లు నేలమట్టమయ్యాయి.

ముందస్తుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఆ తర్వాత మిలిటెంట్లపై దాడులు చేయాల్సిన ప్రభుత్వాలు ఒకేసారి జనావాసాలపై బాంబులు జారవిడిచాయి. దీంతో గౌటాలో ఎక్కడికి అక్కడ నెత్తురు ఏరులై పారుతోంది.

 దాడులపై ఆగ్రహం

దాడులపై ఆగ్రహం

మానవ హక్కులను కాలరాస్తూ సిరియా, రష్యాలు సాగిస్తోన్న బాంబు దాడులపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25న ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సమావేశం జరిగింది. తక్షణమే సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయాలని మండలి తీర్మానం చేసింది. రష్యా కూడా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కాల్పుల విరణపై తగ్గలేదు. సిరియాలో దాడులను ఆపగలిగే శక్తి రష్యాకు ఉందని అమెరికా చెప్పింది.

మానవతా దృక్పథంతో ఐదు గంటల విరామం

మానవతా దృక్పథంతో ఐదు గంటల విరామం

మానవతా దృక్పథంతో రోజుకు ఐదు గంటలు మాత్రమే దాడులను ఆపేస్తామని, ఆ సమయంలోనే జనం సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిన్ పుతిన్ మంగళవారం ఓ ప్రకటన చేశారు.

 ఇలా మిలిటెంట్ల ఆదీనంలోకి

ఇలా మిలిటెంట్ల ఆదీనంలోకి

సిరియా రాజధాని డమాస్కస్ శివారు నమగరమైన గౌటా 2013లో ప్రభుత్వ బలగాల ఆదీనంలో ఉండేది. మిలిటెంట్లు గౌటా నగరంలోకి చొచ్చుకొచ్చారు. 2017 నాటికి వారు తిరిగి ఆయుధ సంపత్తిని పోగేసి గౌటాలో సొంత పెత్తనం చెలాయించే స్థితికి చేరుకున్నారు.

ఇదీ జరిగింది

ఇదీ జరిగింది

ప్రస్తుతం తిరుగుబాటు దళాల గ్రూపులు గౌటా నగరాన్ని పంచుకున్నాయి. తమలో తాము కలహించుకుంటూ ప్రభుత్వ బలగాలతో తలపడుతున్నాయి. జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. డమాస్కస్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌటా నగరంపై పట్టు సాధిస్తేనే సిరియా ప్రభుత్వం మనగలుగుతుంది. దీనిని తమ ఆదీనంలోకి తెచ్చుకోవాలని రష్యా సైన్యంతో కలిసి సిరియా ప్రభుత్వం వైమానిక దాడులు నిర్వహిస్తోంది. అయితే జనాలను తరలించకుండానే చేస్తున్నారు. దీంతో లక్షలాది మంది చనిపోయారు.

English summary
The United States urged Russia on Tuesday to use its "influence" to secure an "immediate" full-fledged halt to a bloody offensive in Syria's rebel-held enclave of Eastern Ghouta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X