వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్ నుండి భారతీయులను, ఇతర విదేశీయులను తరలించేందుకు రష్యా సిద్ధం: యూఎన్ భద్రతామండలికి రష్యా రాయబారి

|
Google Oneindia TeluguNews

తూర్పు ఐరోపా దేశంలో తీవ్ర ఘర్షణల మధ్య, అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను మరియు ఇతర విదేశీ పౌరులను తరలించడానికి తూర్పు ఉక్రేయనియన్ నగరాలైన ఖార్కివ్ మరియు సుమీకి వెళ్లడానికి రష్యన్ బస్సులు క్రాసింగ్ పాయింట్ల వద్ద సిద్ధంగా ఉన్నాయని రష్యా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తెలియజేసింది.

పుతిన్ మెంటలోడు, బైడెన్,మోడీకి చెప్పినా ఫలితంలేదు: రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కేఏ పాల్పుతిన్ మెంటలోడు, బైడెన్,మోడీకి చెప్పినా ఫలితంలేదు: రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కేఏ పాల్

ఉక్రెయిన్ లో చిక్కుకున్న విదేశీయులను తరలించేందుకు రష్యా కృషి : యూఎన్ సమావేశంలో రష్యా

ఉక్రెయిన్ లో చిక్కుకున్న విదేశీయులను తరలించేందుకు రష్యా కృషి : యూఎన్ సమావేశంలో రష్యా


ఐరోపాలో అతిపెద్దదైన ఉక్రెయిన్‌లోని జపోర్జియా అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసిన తరువాత, 15 దేశాల కౌన్సిల్ శుక్రవారం అల్బేనియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, నార్వే, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విదేశీయులను శాంతియుతంగా తరలించేందుకు రష్యా సైన్యం అన్ని విధాలా కృషి చేస్తోందని ఐక్యరాజ్యసమితి రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా ఈ సమావేశంలో అన్నారు. ఉక్రెయిన్ జాతీయవాదులు తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ మరియు సుమీ నగరాల్లో 3,700 మంది భారతీయ పౌరులను "బలవంతంగా" ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు.

ఖార్కివ్, సుమీలలో భారత్ తో పాటు ఇతర దేశాల వారిని నిర్బంధంగా ఉంచుతున్నారని ఆరోపణ

ఖార్కివ్, సుమీలలో భారత్ తో పాటు ఇతర దేశాల వారిని నిర్బంధంగా ఉంచుతున్నారని ఆరోపణ

ఇది ఉక్రేనియన్లను మాత్రమే కాకుండా విదేశీయులను కూడా ప్రభావితం చేస్తుంది. ఉక్రెయిన్ పౌరులు బలవంతంగా ఉంచుకుంటున్న విదేశీ పౌరుల సంఖ్య ఆశ్చర్యకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఖార్కివ్ లో 3,189 మంది భారత జాతీయులు, 2,700 మంది వరకు వియత్నాం జాతీయులు, 202 మంది చైనా జాతీయులు ఉన్నారని వెల్లడించారు. సుమీలో 576 మంది భారతదేశ జాతీయులు, 101 మంది ఘనా జాతీయులు, 121 మంది చైనా జాతీయులు ఉన్నట్టుగా నెబెంజియా కౌన్సిల్‌కు తెలిపారు.

 విదేశీయులను సురక్షితంగా తరలించటానికి 130 బస్సులు

విదేశీయులను సురక్షితంగా తరలించటానికి 130 బస్సులు

రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలో, భారతీయ విద్యార్థులను మరియు ఇతర విదేశీ పౌరులను తరలించడానికి ఖార్కివ్ మరియు సుమీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న 'నెఖోతీవ్కా' మరియు 'సుడ్జా' క్రాసింగ్ పాయింట్ల వద్ద ఈరోజు ఉదయం 6.00 గంటల నుండి 130 బస్సులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. చెక్‌పోస్టులు తాత్కాలిక వసతి, విశ్రాంతి కోసం స్థలం మరియు వేడి ఆహారాన్ని అందించడానికి అమర్చబడి ఉన్నాయని రష్యా రాయబారి తెలిపారు. మందుల స్టాక్‌తో మొబైల్ మెడికల్ స్టేషన్లు కూడా ఉన్నాయని వెల్లడించారు. తరలించిన ప్రతి ఒక్కరూ బెల్గోరోడ్‌కు తీసుకెళ్లబడతారని , అక్కడి నుండి వారి స్వదేశానికి విమానంలో రవాణా చేయబడతారు అని ఆయన పేర్కొన్నారు.

 ఉక్రెయిన్ లో భారత విద్యార్థులు బంధీలుగా ఉన్నారన్న వార్తలపై స్పందించిన అరిందమ్ బాగ్చి

ఉక్రెయిన్ లో భారత విద్యార్థులు బంధీలుగా ఉన్నారన్న వార్తలపై స్పందించిన అరిందమ్ బాగ్చి


న్యూఢిల్లీలో, ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులను బందీలుగా పట్టుకున్నారనే వార్తలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందిస్తూ, భారతీయ విద్యార్థులకు సంబంధించి ఎటువంటి బందీ పరిస్థితి గురించి భారతదేశానికి ఎటువంటి నివేదికలు అందలేదని అన్నారు. ఖార్కివ్ మరియు పొరుగు ప్రాంతాల నుండి విద్యార్థులను దేశం యొక్క పశ్చిమ భాగానికి తీసుకెళ్లడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంలో మేము ఉక్రేనియన్ అధికారుల మద్దతును అభ్యర్థించామని బాగ్చి చెప్పారు.

ఉక్రెయిన్ నుండి భారతీయుల తరలింపుపై అరిందమ్ బాగ్చి

ఉక్రెయిన్ నుండి భారతీయుల తరలింపుపై అరిందమ్ బాగ్చి


రష్యా, రొమేనియా, పోలాండ్, హంగరీ, స్లోవేకియా మరియు మోల్డోవాతో సహా ఈ ప్రాంతంలోని దేశాలతో భారతదేశం సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ నుండి పెద్ద సంఖ్యలో భారతీయ పౌరులను తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది సాధ్యమయ్యేలా ఉక్రేయినియన్ అధికారులు అందించిన సహాయాన్ని మేము అభినందిస్తున్నాము. ఉక్రెయిన్ యొక్క పశ్చిమ పొరుగు దేశాల వారు భారతీయ పౌరులను ఆదరించి వారిని స్వదేశానికి తీసుకెళ్లడానికి సహకరించినందుకు, వారికి వసతి కల్పించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామని బాగ్చి వెల్లడించారు.

English summary
Russian envoy said to the UN Security Council that Russia is ready to evacuate Indians and other foreigners from Ukraine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X