రష్యా తయారీ Sputnik V Vaccine సామర్థ్యం 91.6 శాతం: తాజా అధ్యయనంలో వెల్లడి
కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ గా ముందుకొచ్చినప్పటికీ.. పనితీరుపై అనుమానాలు, క్లినికల్ ట్రయల్స్ డేటా వెల్లడి కాకపోవడంతో రష్యా తయారీ స్ఫూత్నిక్-వి వ్యాక్సిన్ వ్యాపారంలో కాస్త వెనుకబడింది. అయితే, తాజాగా దాని సామర్థ్యంపై జరిపిన అధ్యయనాల్లో పాజిటివ్ రిపోర్టులు వెలువడ్డాయి...
కేసీఆర్ను కమాండ్ చేస్తా -వాళ్ల ఏడుపును సీఎం తట్టుకోలేడు: మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు
కరోనా కట్టడి కోసం రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్ చివరిదశ క్లినికల్ ట్రయల్స్ వివరాలు వెల్లడయ్యాయి. స్పుత్నిక్ వీ మూడో దశ ప్రయోగ వివరాలు ది లాన్సెంట్ ఇంటర్నేషనల్ మెడికల్ జర్నల్ మంగళవారం బయటపెట్టింది.

కరోనా నుంచి ప్రజలను కాపాడటంలో ఈ వ్యాక్సిన్ 91.6శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు మూడో దశ(చివరి దశ) ట్రయిల్స్ లో తేలినట్లు తెలిపింది. ప్లేసీబొ(వ్యాక్సిన్ ప్రభావాన్ని పరీక్షించేందుకు క్లినికల్ ట్రయిల్స్ లో వాడేది)అందుకున్న 19,966 వాలంటీర్లలోని నాలుగోవంతు మంది డేటా ఆధారంగా ఈ ఫలితాలను విడుదల చేసినట్లు గమలేయా ఇనిస్టిట్యూట్ పరిశోధకులు చెప్పారని లాన్సెంట్ పేర్కొంది.
మాస్కోలో స్పుత్నిక్ వీ ట్రయిల్స్ ప్రారంభమైనప్పటి నుంచి..వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 16 సింప్టమాటిక్ కోవిడ్-19(కరోనా రోగ లక్షణాలు ఉన్న)కేసులు నమోదయ్యాయని..ప్లేసిబో గ్రూప్ లో 62 మందికి వైరస్ సోకిందని సైంటిస్టులు తెలిపారు. వ్యాక్సిన్ యొక్క రెండు-డోస్ ల నియమావళి( 21 రోజుల వ్యవధిలో రెండు సార్లు వ్యాక్సిన్ ఇస్తారు) COVID-19పై 91.6% ప్రభావవంతంగా పనిచేస్తుందని ఇది చూపించిందని వారు తెలిపారు.
నిమ్మగడ్డపై చర్యలు -అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీలో రచ్చ -కీలక నిర్ణయం -జగన్ వెనక్కి తగ్గారా?