ట్రంప్ కు పుతిన్ మాస్ వార్నింగ్.. మధ్యలో రావొద్దంటూ..
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లుగా సాగుతున్న యుద్ధం ఇటీవల ఉద్ధృతం అయింది. ఉక్రెయిన్ పై రష్యా వందల కొద్దీ డ్రోన్ లు, మిసైల్స్ లో విరుచుకుపడుతోంది. 7 రోజుల వ్యవధిలోనే రెండు సార్లు బిగ్గెస్ట్ ఎటాక్స్ చేసింది రష్యా. ఓ సారి 550 డ్రోన్ లు, 11 మిసైల్స్ తో విధ్వంసం సృష్టించింది. అంతకుముందు 477 డ్రోన్ లు, 60 మిసైల్స్ లో భీకర దాడులు చేసింది. దీంతో ఇరువురి మధ్యలోకి అమెరికా వచ్చింది. చర్చలకు రష్యా నుంచి సరైన స్పందన రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ కు ఆయుధాలు అందిస్తామని అన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా ఘాటుగా స్పందించింది.
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లుగా యుద్ధం జరగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య అనేకసార్లు చర్చలు జరిగినప్పటికీ అవి పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తోంది. వందల కొద్దీ డ్రోన్ లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా దాడులు చేస్తోంది. రెండు రోజుల క్రితం కీవ్ నగరం లక్ష్యంగా 550 డ్రోన్ లు, 11 మిసైల్స్ తో విధ్వంసం సృష్టించింది రష్యా . ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్ కు తాము అదనపు ఆయుధాలు పంపిస్తామని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ కు వారి ప్రజల్ని, దేశాన్ని రక్షించుకునే హక్కు ఉందని అందువల్ల వారికి మద్ధతుగా మరిన్ని ఆయుధాలు పంపిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను రష్యా తీవ్రంగా పరిగణించింది. రష్యా- ఉక్రెయిన్ మధ్యలో అమెరికా వస్తే.. పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతాయని హెచ్చరించింది. శాంతి చర్చలను కోరుకుంటున్న ట్రంప్.. ఆయుధాలు ఎలా పంపిస్తారని ఎద్దేవా చేసింది.
US President Donald Trump said the United States would be sending more weapons to Ukraine to help the war-torn country defend itself against Russian attacks https://t.co/MPxAd2MbHg
— Reuters (@Reuters) July 8, 2025
ఈ మేరకు రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అక్కడి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కావాలని కోరుకుంటున్న ట్రంప్.. వైఖరి మాత్రం భిన్నంగా ఉందన్నారు. అంతేకాక యూరోపిన్ దేశాలు కూడా ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకుముందు ట్రంప్ మాట్లాడుతూ.. "ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు సరఫరా చేస్తాం. ఆ దేశానికి తమను తాము కాపాడుకునే హక్కు ఉంది. రష్యా దాడులను తట్టుకునే ఆయుధాలే సరఫరా చేస్తాం. అవి రష్యా దాడులను తిప్పికొడతాయి. పుతిన్ విషయంలో నేను సంతోషంగా లేను" అని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
The Kremlin has already jumped on commenting on the morning news that the USA will send weapons to Ukraine. Peskov said that this indicates an "intention to continue hostilities" 🤦
— Belsat in English (@Belsat_Eng) July 8, 2025
At the same time, Putin's Spokesman stated that Moscow highly values Trump's efforts for peace.… pic.twitter.com/KspqGOBq40
మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఎవరి మాటా వినకుండా ఉక్రెయిన్ పై పంజా విసురుతున్నారు. దాడులు ఆపేయాలంటూ అటు యూరోపియన్ దేశాలు.. ఇటు అమెరికా పుతిన్ పై ఒత్తిడి తెచ్చినా ఆయన మాత్రం తగ్గడంలేదు. ఇటీవల మరింత ఉద్ధృతంగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది రష్యా. వందల కొద్దీ డ్రోన్ లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది.
-
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications