ట్రంప్ కు పుతిన్ భారీ షాక్..! భారత్ కు మరో బంపర్ ఆఫర్..!
రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్దానికి పరోక్షంగా ఆజ్యం పోస్తున్నామనే కారణంతో భారత్ పై 50 శాతం సుంకాలు విధించి ట్రంప్ కు ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ భారీ షాక్ ఇచ్చారు. ఇప్పటికే రష్యా చమురు కొనుగోళ్లు భారత్ పై రకరకాలుగా ఒత్తిడి పెంచుతున్న ట్రంప్ కు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో అటు అమెరికాకు షాక్ తగలనుండగా.. ఇటు భారత్ కు ఊరట లభించబోతోంది.
అమెరికా విధిస్తున్న సుంకాల కారణంగా భారత్ కు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసేందుకు రష్యా అధినేత పుతిన్ ముందుకొచ్చారు. అమెరికా సుంకాల నష్టాన్ని భర్తీ చేసే స్ధాయిలో ముడి చమురు ఎగుమతి చేయడంతో పాటు అదనంగా భారత్ నుంచి వ్యవసాయ, వైద్య పరికరాల ఉత్పత్తుల దిగుమతులు పెంచాలని పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ ను ఇది సార్వభౌమ దేశంగా మారుస్తుందని పుతిన్ పేర్కొన్నారు.

వాణిజ్య అసమతుల్యతను తొలగించడానికి రష్యా భారతదేశం నుండి మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఔషధాలను దిగుమతి చేసుకుంటామని పుతిన్ ఇవాళ ప్రకటించారు. రష్యా చమురు దిగుమతులు ఆపాలని భారతదేశంపై అమెరికా తెస్తున్న ఒత్తిడిపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రధాని మోడీ ఎప్పటికీ అలాంటి నిర్ణయం తీసుకోరని పుతిన్ తేల్చేశారు. భారతదేశం మన ఇంధన సరఫరాలను నిరాకరిస్తే, అది కొంత నష్టాన్ని చవిచూస్తుంది. అయితే వాళ్లు అలాంటి నిర్ణయం తీసుకోరని తెలిపారు.

భారత్ ప్రజలు తనను నమ్మాలని, మీరు రాజకీయ నాయకత్వం తీసుకునే నిర్ణయాలను నిశితంగా పరిశీలిస్తారని పుతిన్ తెలిపారు. ఎవరి ముందు ఎటువంటి అవమానాన్ని అనుమతించరన్నారు. అలాగే ప్రధాని మోడీ తనకు తెలుసని, ఆయన స్వయంగా ఇలాంటి చర్య ఎప్పటికీ తీసుకోరని వెల్లడించారు. భారత్-రష్యా బంధం ప్రత్యేకమైనదని పుతిన్ తెలిపారు. అలాగే ప్రధాని మోడీ తన స్నేహితుడు అని కూడా చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీని "సమతుల్య, తెలివైన" మరియు "జాతీయ దృక్పథం కలిగిన నాయకుడిగా అభివర్ణించారు. రష్యా నుండి చమురు దిగుమతులను నిలిపివేయాలని అమెరికా ఒత్తిడిని పట్టించుకోకుండా భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు.












Click it and Unblock the Notifications