russia-ukrain crisis : రష్యా దాడుల్లో 198 మంది ఉక్రెయిన్ల మృతి-ముగ్గురు పిల్లలు సహా
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మూడో రోజు కూడా విజయవంతంగా కొనసాగుతొంది. ఉక్రెయిన్ లోని మెలిటోపోల్ సహా పలు కీలక నగరాల్ని రష్యా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ స్వాధీనంపై సందిగ్దత కొనసాగుతోంది. మరోవైపు కీవ్ లోనే ఉన్న అధ్యక్షుడు జెలెన్ స్కీ అక్కడి నుంచే ప్రజల్ని ఉత్సాహపరుస్తున్నారు.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలైన తొలి రెండు రోజుల్లో 198 మంది పౌరులు చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి విక్టర్ లియాష్కో ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే వెయ్యిమందికి పైగా పౌరులు గాయపడినట్లు తెలిపారు. మృతుల్లో సైనికులు, పౌరులు కూడా ఉన్నారా అనేది స్పష్టం కాలేదు.
మరోవైపు రష్యా చేస్తున్న దాడులతో బెంబేలెత్తుతున్న లక్షకు పైగా ప్రజలు ఇప్పటికే సరిహద్దులు దాటి పోలాండ్ వెళ్లిపోయారు. భారీ వైమానిక మరియు క్షిపణి దాడులతో గురువారం ప్రారంభమైన రష్యా దాడిలో 33 మంది పిల్లలతో సహా మరో 1,115 మంది గాయపడ్డారని మరియు ఉత్తర, తూర్పు మరియు దక్షిణాల నుండి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించిన దళాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

మరోవైపు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా మాట్లాడుతూ, ఫ్రెంచ్ విదేశాంగమంత్రితో మాట్లాడానని, స్పిఫ్ట్ కూటమి నుంచి రష్యాను నిషేధించడానికి ఫ్రాన్స్ మద్దతు ఇస్తోందన్నారు. రష్యా దాడిని ఆపడానికి ఈయూ ఆంక్షల మూడవ ప్యాకేజీని వెంటనే ప్రవేశపెట్టాలని కోరినట్లు చెప్పారు. ఉక్రెయిన్ తనను తాను రక్షించుకోవడానికి సహాయం చేయడానికి ఫ్రాన్స్ కూడా ఆయుధాలు, సైనిక సామగ్రిని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.
ఉక్రెయిన్ రాజధాని కైవ్ వెలుపల ఉన్న వ్యూహాత్మక హాస్టమెల్ ఏరోడ్రోమ్‌ను తమ బలగాలు స్వాధీనం చేసుకున్నాయని, ఆ ప్రాంతంలో పారాట్రూపర్‌లను దించాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. హాస్టమెల్ నగరానికి వాయువ్యంగా కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.












Click it and Unblock the Notifications