Russia war:సెక్స్ రొంపిలోకి ఉక్రెయిన్ మహిళలు-సరిహద్దుల్లో మాటేసిన చెత్తనాయళ్లు..!!
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించి నెల రోజుల పైనే అయ్యింది. ఉక్రెయిన్‌ను పూర్తిగా ధ్వంసం చేయాలనే ఉద్దేశంతోనే పుతిన్ పట్టుదలతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఓ వైపు తమ దేశ పౌరుల ప్రాణాలు నేలకొరుగుతున్న బలోపేతమైన రష్యాను ధీటుగానే ఉక్రెయిన్ ఎదుర్కొంటోంది. ఇక సందులో సడేమియా అన్నట్లుగా యుద్ధం నేపథ్యంలో దోచుకుంటున్న వారికి దోచుకున్నంత అన్నట్లుగా తయారైంది ఉక్రెయిన్‌లో పరిస్థితి. ఇదిలా ఉంటే తాజాగా మరో వార్త ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది.

ఉక్రెయిన్ సరిహద్దుల్లో కంత్రీగాళ్లు
ఉక్రెయిన్‌లో పరిస్థితి ఛిన్నా భిన్నంగా తయారైంది. రష్యా దాడులతో చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా మిగిలిపోయారు. సొంతవాళ్లకు దూరమయ్యారు. కుటుంబాలు కుటుంబాలే కనిపించడం లేదు. రష్యా చేస్తున్న భీకరమైన దాడులకు పొట్ట చేతపట్టుకుని పొరుగు దేశాలకు పరుగులు తీసి అక్కడ తల దాచుకుంటున్నారు. భర్తకు భార్య, తల్లిదండ్రులకు పిల్లలు, ఇలా అంతా ఒకరినొకరు వీడి ఎక్కడుంటున్నారో కూడా తెలియని పరిస్థితి ఉక్రెయిన్‌లో నెలకొంది. ఇక ఇదే అదనుగా కొందరు కంత్రీగాళ్లు బయలుదేరారు. ఉక్రెయిన్‌ను వీడుతున్న అందమైన అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు.

తెలియని వారి చెంతకు అమ్మాయిలు
రష్యా చేస్తున్న దాడులతో ఇప్పటికే కోటి మంది ప్రాణాలను అరచేతిలో పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారంటూ ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో పేర్కొంది. ఇక 30 లక్షలకు పైగా ఉక్రెయిన్ సరిహద్దులు దాటి పొరుగు దేశాలకు వెళ్లిపోయారు. ఇందులో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నారు. ఇక 60 ఏళ్లకు మించకుండా ఉండే పురుషులు మాత్రం సైనికులుగా అవతారమెత్తి తమ దేశం కోసం పోరాడుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఎటు వెళ్లాలో తెలియక, ఎక్కడ తలదాచుకోవాలో తెలియని వాళ్లు చాలానే ఉన్నారు. ఇలాంటి వారంతా ఎవరో తెలియని వారి చెంతకు చేరుతున్నారు. వారు ఏం చెబితే అదే చేస్తున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువగా అమ్మాయిలే ఉంటున్నారు.

సెక్స్ రొంపిలోకి అమ్మాయిలు
ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా దాడుల నుంచి తప్పించుకుని తలదాచుకునేందుకు పొరుగు దేశాలకు వెళుతున్నారు. అయితే అక్కడ సురక్షితంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. ముఖ్యంగా మహిళల పరిస్థితి అయితే దారుణం. ఆశ్రయం కల్పిస్తామన్న పేరుతో కొందరు కేటుగాళ్లు అమ్మాయిలను చేరదీసి వారిని సెక్స్ రొంపిలోకి దింపుతున్నారు. తద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం విస్మయానికి గురిచేస్తోంది. రష్యా భీకర దాడులతో అల్లాడిపోతున్న మహిళలను చూసి జాలి చూపించాల్సిన ఈ కేటుగాళ్లు వాళ్ల శరీరంతో సొమ్ము ఎలా చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరర్స్ కూడా ప్రస్తావించారు.

కేటుగాళ్ల నుంచి తప్పించుకున్న మహిళ
ఉక్రెయిన్ సరిహద్దులు దాటగానే అక్కడే వాలంటీర్ల ముసుగులో అమ్మాయిలను ట్రాప్ చేస్తారు. ఆ పై వారిని వ్యభిచార రొంపిలోకి దింపి సొమ్ము చేసుకోవాలని చూస్తుంటారని సమాచారం. ఇక వాలంటీర్ల ముసుగులో ఉన్న కొందరు పురుషులు స్విట్జర్లాండ్‌లో ఆశ్రయం కల్పిస్తామని చెప్పి వారిని ఓ వ్యాన్‌లో తీసుకెళుతున్నారు. ఇలాంటి పరిస్థితే ఓ మహిళ ఎదుర్కొంది. వాలంటీర్లు చూసే చూపుతో తనకు అనుమానం వచ్చిందని వెంటనే వారి ఐడీలను చూపించాల్సిందిగా కోరగా అందుకు వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మహిళ పేర్కొంది. అనుమానం బలపడటంతో తన కూతురును తీసుకుని వేరే చోటికి పరుగులు తీసి తప్పించుకుందని చెప్పుకొచ్చింది.
ఇలా ప్రాణాలు చేతిలో పెట్టుకుని రష్యా దాడుల నుంచి తప్పించుకుని సరిహద్దులకు చేరిన ఇలాంటి మహిళలను కొందరు కేటుగాళ్లు వ్యభిచార కూపంలోకి దింపుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. ఐక్యరాజ్యసమితి వెంటనే చర్యలు తీసుకోవాలని పలు ప్రజాసంఘాలు, అంతర్జాతీయ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications