Russia-Ukraine: యుద్ధాలకు కాలం చెల్లిందన్న దలైలామా, అహింసే ఉత్తమమార్గం
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న క్రమంలో ప్రముఖ టిబెట్ బౌద్ధ గురువు దలైలామా స్పందించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై దలైలామా సోమవారం వేదన వ్యక్తం చేశారు. తూర్పు ఐరోపా దేశంలో శాంతిని త్వరగా పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు.

యుద్ధాలకు కాలం చెల్లిందన్న దలైలామా
'మన ప్రపంచం చాలా పరస్పర ఆధారితంగా మారింది, రెండు దేశాల మధ్య హింసాత్మక ఘర్షణ అనివార్యంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. యుద్ధాలకు కాలం చెల్లినది - అహింస మాత్రమే మార్గం. ఇతర మానవులను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మనం సోదరులు, సోదరీమణులుగా మానవత్వ ఏకత్వం భావాన్ని పెంపొందించుకోవాలి. ఈ విధంగా మనం మరింత శాంతియుత ప్రపంచాన్ని నిర్మించగలం' అని 14వ దలైలామా తన వెబ్‌సైట్‌లో ఒక ప్రకటనలో తెలిపారు.

21వ శతాబ్ధం సంభాషణల శతాబ్దం కావాలన్న దలైలామా
చర్చల ద్వారా సమస్యలు, విభేదాలు ఉత్తమంగా పరిష్కరించబడతాయని పునరుద్ఘాటించిన దలైలామా.. 'పరస్పర అవగాహన, ఒకరి శ్రేయస్సు పట్ల గౌరవం ద్వారా నిజమైన శాంతి ఏర్పడుతుంది' అని స్పష్టం చేశారు. 'మనం ఆశను కోల్పోకూడదు. 20వ శతాబ్దం యుద్ధం, రక్తపాతం శతాబ్దం. 21వ శతాబ్దం సంభాషణల శతాబ్దంగా ఉండాలి' అని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. టిబెట్‌పై చైనా అణిచివేత తరువాత 1959లో టిబెట్ నుంచి పారిపోయినప్పటి నుంచి భారతదేశంలోనే ఉంటున్నారు దలైలామా. చైనా కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా స్థానిక టిబెటన్ల తిరుగుబాటు చేస్తున్నారు.

రష్యా-ఉక్రెయిన్ చర్చలు.. నెమ్మదించిన రష్యన్ బలగాలు
వరుసగా ఐదో రోజు కూడా ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడులు జరుపున్న క్రమంలో దలైలామా ఈ ప్రకటన చేశారు. కాగా, 3,500 మందికి పైగా రష్యన్ సైనికులు చంపబడ్డారని, 200 మందికి పైగా యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకారం, ఒక చిన్నారితో సహా 352 మంది ప్రజలు మరణించారు. కాగా, రష్యా దళాలు పూర్తి స్థాయి దండయాత్ర ప్రారంభించిన ఫిబ్రవరి 24 నుంచి దాదాపు 4 లక్షల మంది ప్రజలు దేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఈ అంచనాలతో ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభం క్షీణించిందని ఐక్యరాజ్యసమితి హైకమీషనర్ పేర్కొన్నారు. ఇంతలో, ఐరోపాలో పెరుగుతున్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా ప్రతినిధి బృందం బెలారస్‌కు చేరుకుంది. ఈ క్రమంలో రష్యా బలగాలు దాడులను కాస్తా నెమ్మదించాయని ఉక్రెయిన్ పేర్కొంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications