Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉక్రెయిన్‌పై భీక‌ర దాడులు : భార‌తీయ‌ల త‌ర‌లింపునకు ర‌ష్యా సాయం.. 130 ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు !!

ఉక్రెయిన్‌పై రష్యా దాడులను మరింత పెంచింది. ఇప్పటికే ఖర్కివ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. యూరప్‌లోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌పై క్షిపణులతో దాడులకు దిగింది.. ఈ కేంద్రాన్ని రష్యా సేనలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఇతర ప్రాంతాలను స్వాధీనం చేసుకునే దిశగా బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఎక్కడ చూసినా భయానకపరిస్థితులు నెలకొన్నాయి. ఈపరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు మోదీ ప్రభుత్వం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. అపరేషన్ గంగా పేరుతో వేలాది మందిని స్వదేశానికి తరలిస్తోంది.

భార‌తీయుల కోసం ర‌ష్యా బస్సులు

భార‌తీయుల కోసం ర‌ష్యా బస్సులు

ఉక్రెయిన్‌లోని ఖర్కిన్, సుమే ప్రాంతాల్లో వేలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. వారితో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు సాయం చేసేందుకు రష్యా ముందుకు వచ్చింది. వారందరిని తరలించేందుకు 130 బస్సులు సిద్దంగా ఉన్నట్లు రష్యా రక్షణశాఖ కంట్రోల్ సెంటర్ వెల్లడించింది. రష్యాలోని బెల్గోరాడ్ ప్రాంతానికి విద్యార్థులందరిని తరలించనున్నట్లు కల్నర్ జనరల్ మిఖేయిల్ మిజిన్ సేవ్ తెలిపారు.

 ఖ‌ర్కివ్, సుమీల నుంచి త‌ర‌లింపు

ఖ‌ర్కివ్, సుమీల నుంచి త‌ర‌లింపు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందకు తగు ఏర్పాట్లు చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని భారత ప్రధాని మోదీ కోరారు. ఈనేపథ్యంలో విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూ ర‌ష్యా నిర్ణయం తీసుకుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రష్యా కల్నల్ జనరల్ మిఖాయిల్ మిఖాయిల్ మిజిన్‌ట్సన్ వెల్లడించారు. ఈ బస్సులు బెల్గోరోడ్‌లోని నెఖొటెయ్‌వాక్క, సుడ్‌జా చెక్‌పాయింట్ల నుంచి ఖర్కీవ్, సుమీ ప్రాంతాలకు వెళ్తాయని చెప్పారు. తిరిగి ఆ బస్సులు వచ్చాక చెక్ పాయింట్ల వద్ద నుంచి తమ సైనిక విమానాల్లో వారిని గమ్యస్థానాలకు చేరుస్తామని తెలిపారు.

ఆప‌రేష‌న్ గంగ‌

ఆప‌రేష‌న్ గంగ‌


ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు ఆపరేషన్ గంగ ద్వారా 9వేల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న దేశాలకు ప్రత్యేక విమానాలను పంపించి అక్కడి నుంచి భారతీయును తరలిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పించే కార్యక్రమాన్ని నలుగురు కేంద్రమంత్రులకు మోదీ ప్రభుత్వం అప్పజెప్పింది. రొమేనియా, హంగరీల నుంచి భారత వాయు సేనకు చెందిన మూడు సీ-17 విమానాల్లో మొత్తం 630 మంది హిందోన్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న‌ ప్ర‌తి భార‌తీయుడిని త‌ర‌లించేవ‌ర‌కు కేంద్రం ప‌నిచేస్తోంద‌ని అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+