ఉక్రెయిన్‌కు రష్యా షాక్!: డ్రోన్ దెబ్బకు కకావికలం (వీడియో)
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మానవరహిత వ్యవస్థల వినియోగం పెరగడంతో యుద్ధ వ్యూహాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. తాజాగా రష్యా తన నౌకాదళ డ్రోన్లను ఉపయోగించి ఉక్రెయిన్‌కు చెందిన గూఢచర్య నౌక 'సింఫెరోపోల్'ను ముంచేసింది. ఈ నౌకాదళ దాడిలో ఉక్రెయిన్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు రష్యా రక్షణ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పదేళ్లలో ఉక్రెయిన్ ప్రారంభించిన అతిపెద్ద నౌకగా పేరుగాంచిన సింఫెరోపోల్.. డెనూబ్ నది డెల్టాలో జరిగిన ఈ దాడిలో పూర్తిగా ధ్వంసమైంది.
🚨⚡️ BREAKING:
— RussiaNews 🇷🇺 (@mog_russEN) August 28, 2025
Russia Unleashes Kamikaze Sea Drones.
An unmanned suicide boat from the Black Sea Fleet has just sent the Ukrainian reconnaissance ship "Simferopol" to the bottom at the mouth of the Danube.
A new era of naval warfare is here.. 🇷🇺🔥 pic.twitter.com/OnOiHR0LsJ
దాడి వివరాలు.. నౌక ప్రాముఖ్యత
రష్యాకు చెందిన సీ డ్రోన్ ఈ దాడిని విజయవంతంగా నిర్వహించింది. ఈ తరహా డ్రోన్ ను ఉపయోగించి ఒక నౌకను ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి అని నిపుణులు పేర్కొన్నారు. ఈ నౌక రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్, ఆప్టికల్ గూఢచర్య కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది ఉక్రెయిన్ సైనిక కార్యకలాపాలకు చాలా కీలకమైనది. 2019లో ప్రారంభించి 2021లో ఉక్రెయిన్ నౌకాదళంలో చేర్చిన ఈ నౌక.. 2014 తర్వాత ఉక్రెయిన్ నిర్మించిన అతిపెద్ద నౌకగా వార్‌గోంజో టెలిగ్రామ్ ఛానెల్ తెలిపింది. ఈ నౌక విధ్వంసం ఉక్రెయిన్‌కు వ్యూహాత్మకంగా పెద్ద ఎదురుదెబ్బ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

యుద్దంలో డ్రోన్ల వినియోగం పెరుగుదల
ఈ సీ డ్రోన్ దాడిలో ఒక సిబ్బంది మరణించగా.. పలువురు గాయపడినట్లు ఉక్రేనియన్ అధికారులు ధ్రువీకరించారు. గల్లంతైన నావికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన రష్యా ఇటీవలి కాలంలో నౌకాదళ డ్రోన్లు, ఇతర మానవరహిత వ్యవస్థల ఉత్పత్తిని ఎంతవేగంగా పెంచిందో స్పష్టం చేస్తుంది. ఈ డ్రోన్లు యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరో సంఘటనలో ఉక్రెయిన్‌లో టర్కిష్ బేరక్తర్ డ్రోన్లను ఉత్పత్తి చేసే ఒక సదుపాయంపై రష్యా రెండు క్షిపణులతో దాడి చేసిందని ఉక్రెనియన్ రాజకీయ నాయకుడు ఇగోర్ జింకెవిచ్ పేర్కొన్నారు. ఈ పరిణామాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మానవరహిత వ్యవస్థల వాడకం ఎంతగా పెరిగిందో స్పష్టం చేస్తోంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications