Russia-Ukraine War: యూఎస్ లో 14 ఏళ్ల గరిష్టానికి పెట్రో ధరలు-అయినా భారత్ కంటే తక్కువే

రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా చమురు ధరలు మండిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాల్లో చమురు ధరలు గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్ధాయికి చేరుకున్నాయి. అమెరికాలో అయితే 14 ఏళ్ల గరిష్టానికి చమురు ధరలు చేరుకున్నాయి. దీంతో అక్కడ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. రష్యా నుంచి అమెరికాకు చమురు దిగుమతులు తక్కువే అయినా మిగతా దేశాల నుంచి తీసుకుంటున్న చమురుపైనా భారం పెరుగుతోంది. దీంతో బైడెన్ సర్కార్ కూడా ధరలు పెంచుకుంటూ పోతోంది.

యూఎస్ లో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కానీ భారతదేశంలోని ధరలతో పోలిస్తే మాత్రం అవి ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయి. మార్చి 10న ఒక గాలన్ గ్యాసోలిన్ (పెట్రోల్) సగటు ధర $4.31 (సుమారు రూ. 329)గా ఉంది. ఈ వారంలో పెట్రోల్ ధరలు 14 సంవత్సరాలలో అత్యధిక స్థాయికి ఎగబాకాయి. అలాగే 2008 జూలై 17 నమోదైన $4.11 రికార్డును అధిగమించాయి. ఒక గాలన్ డీజిల్ సగటు ధర $5.05గా నమోదై మరింత మండిపోతోంది.

Russia-Ukraine War: US petrol prices reaches 14 years high, but cheaper than in india

యూఎస్ లో ఇంధనం లీటర్లలో కాకుండా గ్యాలన్లలో అమ్ముతారు. ఆ ప్రకారం చూస్తే గ్యాలన్ విలువ 3.78 లీటర్లకు సమానం. దీన్ని యూకే గ్యాలన్, ఇంపీరియల్ గాలన్ అని కూడా పిలుస్తారు. యూఎస్‌లో లీటర్ పెట్రోల్, యూఎస్ గ్యాలన్‌ను లీటర్‌గా, డాలర్లను రూపాయిలుగా మార్చినప్పుడు దాని విలువ భారతీయ కరెన్సీలో రూ. 86.97.గా ఉంది. అంటే భారతదేశంలో కొన్నేళ్లుగా అమ్ముతున్న పెట్రోల్ ధర ఇది తక్కువే.

భారత్ లోనూ ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా కేంద్రం పెట్రోల్ ధరల్ని పెంచలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో రష్యా ఉక్రెయిన్ వార్ ను సాకుగా చూపుతూ భారీ ఎత్తున పెంచేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రధాని మోడీ నిన్న సంకేతాలు ఇచ్చేశారు. దీంతో జనం మరోసారి బెంబేలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+