వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్‌లో ర‌ష్యా సేన‌ల విధ్వంసం : చిన్న నగరాలు క‌నుమ‌రుగైట్లే ! పుతిన్‌పై జెలెన్ స్కీ ఫైర్

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌పై రష్యా సేనల భీకర దాడులు కొనసాగుతున్నాయి. నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. వాటిపై పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలు నగరాలను స్వాధీనం చేసుకున్నాయి . ఉక్రెయిన్ రాజధాని కీవ్ శివార్లలో భారీగా తమ సైనిక బలగాలను రష్యా పెద్ద ఎత్తున మోహరించింది. కీవ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా దూసుకెళ్తున్నాయి. వీలైనంత త్వరగా నగరాలన్నింటినీ తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ఉక్రెయిన్‌పై తన ఆస్త్రాలను ప్రయోగిస్తోంది. ఈ దురాక్రమణ నేపథ్యంలో అమెరికాతో పాటు యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలను కఠినతరం చేశాయి. అయినా వెన‌క్కి త‌గ్గేది లేద‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ తేల్చిచెప్పారు.

చిన్న న‌గ‌రాలు పూర్తిగా ధ్వంసం

చిన్న న‌గ‌రాలు పూర్తిగా ధ్వంసం

రష్యా వైమానిక, క్షిపణుల దాడుల్లో ఉక్రెయిన్‌లోని చిన్న చిన్న పూర్తిగా ధ్వంసమైయ్యాయి. అవి ఇక కనుమరుగైనట్లేనంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎటూ చూసినా భయానక పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. భారీగా ఆస్తి నష్టంతో పాటు పౌరులు మరణించారు. మానత్వంకూడా లేకుండా రష్యా దళాలు ఆస్పత్రులపై దాడులు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక యూరప్ దేశంపై జరిగిన అతిపెద్ద దాడి ఇది అని జెలెన్ స్కీ దుయ్యబట్టారు.

కార్పెట్ బాంబింగ్‌తో ..

కార్పెట్ బాంబింగ్‌తో ..

ఉక్రెయిన రాజధాని కీవ్‌కు 15 కిలో మీటర్ల దూరంలో రష్యా బలగాలు మోహరించాయి. కీవ్ నగరం వైపు దూసుకోస్తున్నాయి. రష్యా సేనలు కార్పెట్ బాంబింగ్‌తో ఈ ప్రాంత చరిత్రను తుడిచిపెట్టేసి , మమ్మల్ని నాశనం చేసి.. తర్వాత కీవ్‌లో అడుగు పెట్టాల‌ని అనుకుంటే వాళ్లని రానివ్వండి. కానీ ఇక్కడ వాళ్లే బతకాల్సి ఉంటుందని జెలెన్ స్కీ మండిపడ్డారు. సామాన్య పౌరులకు సహాయక చర్యలను కూడా అందకుండా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. కీవ్‌కు సమీపంలో రష్యా బలగాలు బాంబులతో వీరుచుకుపడుతున్నాయి.

ఉక్రెయిన్‌దే త‌ప్పు..

ఉక్రెయిన్‌దే త‌ప్పు..

ఈ దాడుల నుంచి తప్పించుకునేందుకు నగరాన్ని వీడి ట్రక్కుల్లో వెళ్తున్న సాధారణ ప్రజలపై కూడా దాడులకు పాల్పడ్డారని జెలెన్ స్కీ ఆరోపించింది. ఈ దాడిలో ఏడుగురు పౌరులతో పాటు ఒక చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.

మరియోపోల్‌లో ఇప్పటి వరకు సుమారు 1500 మంది మృతి చెందినట్లు ప్రకటించింది. అయితే రష్యా మాత్రం ఈ దాడులను ఖండించింది. తాము ఇప్పటివరకు పౌరులను టార్గెట్ చేయలేదని పేర్కొంటోంది. తమ సైనిక బలగాలు చుట్టుముట్టిన నగరాల నుంచి తమ పౌరులను బయటకు తీసుకెళ్లలేకపోవడం ఉక్రెయిన్‌దే తప్పదని ఎదురుదాడికి దిగింది.

English summary
Zelenskyy angry on Putin over small cities disappearing in Ukraine..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X