Russia VS Ukraine: ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిగా రష్మా చెంచ్మా పేరు ?, క్రిమినల్, పుతిన్ స్కెచ్ !
మాస్కో/ఉక్రెయిన్: రష్యా ఏదో అనుకుంటో ఏదో జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో ఉక్రెయిన్ మొత్తం స్వాధీనం చేసుకోవాలని స్కెచ్ వేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖంగుతిన్నాడు. ఉక్రెయిన్ మీద యుద్దం మొదలు పెట్టి 8 రోజులు అవుతున్నా ఆదేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోయిన రష్యా సేనలు ఇప్పుడు ఉడత లాంటి ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్ మీద అణు అస్త్రం ప్రయోగించాలని రష్యా ఆలోచిస్తోందని వెలుగు చూసింది. ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకున్న తరువాత తనను ఎదిరించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని గద్దె దింపేసి తనకు నమ్మకమైన వ్యక్తిని అధ్యక్షుడి పీఠం మీద కుర్చోబెట్టాలని వ్లాదిమిర్ పుతిన్ స్కెచ్ వేశాడని అంతర్జాతీయ మీడియా అంటోంది.
ఇప్పటికే రష్యా ఆశ్రయం పొందుతున్న ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు విక్టర్ యసుకోవిచ్ పేరు ఇప్పుడు తెర మీదకు వచ్చింది. గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా విక్టర్ యనుకోవిచ్ ఎన్నికైన సమయంలో ఆ దేశంలో హింసాత్మక నిరసనలు వెల్లువెత్తడంతో రష్యాకు పారిపోయిన విక్టర్ యనుకోవిచ్ పేరు ఇప్పుడు ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడి జాబితాలో చేరింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నీచపు స్కెచ్ వేశాడని తెలుసుకున్న ఉక్రెయిన్ సైనికులు ఇప్పుడు ప్రాణాలకు తెగించి రష్యా సైనికులతో పోరాడుతూ వారి అంతు చూడాలని ప్రయత్నిస్తున్నారు.

ఉడత లాంటి ఉక్రెయిన్ మీద రష్యా ప్రతాపం
రష్యా ఏదో అనుకుంటో ఏదో జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో ఉక్రెయిన్ మొత్తం స్వాధీనం చేసుకోవాలని స్కెచ్ వేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖంగుతిన్నాడు. ఉక్రెయిన్ మీద యుద్దం మొదలు పెట్టి 8 రోజులు అవుతున్నా ఆదేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోయిన రష్యా సేనలు ఇప్పుడు ఉడత లాంటి ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతున్నాయి.

నన్నే ఎదిరిస్తాడా అంటూ రగిలిపోతున్న పుతిన్
ఉక్రెయిన్ మీద అణు అస్త్రం ప్రయోగించాలని రష్యా ఆలోచిస్తోందని వెలుగు చూసింది. ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకున్న తరువాత తనను ఎదిరించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని గద్దె దింపేయాలని, అవసరం అయితే తన దేశం (రష్యా) సైనికులతో జెలెన్ స్కీని అంతం చేయించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ డిసైడ్ అయ్యాడని ఆరోపణలు ఉన్నాయి. నన్నే ఎదరించే స్థాయికి చేరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని అంతు చూడాలని వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయించాడని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు అంటున్నాయి.

ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిగా రష్యా చెంచ్మా పేరు ?
ది కీవ్ ఇండిపెండెంట్ మీడియా కథనం మేరకు ఉక్రెయిన్ ను స్వాదీనం చేసుకున్న తరువాత ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీని గద్దె దింపేసి తనకు నమ్మకమైన విక్టర్ యనుకోవిచ్ ను ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిగా నియమించాలని వ్లాదిమిర్ పుతిన్ స్కెచ్ వేశాడని సమాచారం. రష్యాకు చెంచ్మాగా ఉన్న విక్టర్ యనుకోవిచ్ ను ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిగా చేస్తే మనం చెప్పినట్లు వింటటాడని వ్లాదిమర్ పుతిన్ బావిస్తున్నాడని తెలిసింది.

ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు
2010లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా విక్టర్ యనుకోవిచ్ ఎన్నికైన తరువాత 2013లో ఆ దేశంలో హింసాత్మక నిరసనలు వెల్లువెత్తడంతో అతను రష్యాకు పారిపోయాడు. అప్పటి నుంచి విక్టర్ యనుకోవిచ్ రష్యాలోనే తలదాచుకుని ఉక్రెయిన్ వైపు కన్నెత్తికూడా చూడకుండా ఉంటున్నాడు. ఇలాంటి విక్టర్ యనుకోవిచ్ పేరు ఇప్పుడు ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడి పేర్ల జాబితాలో చేరడం హాట్ టాపిక్ అయ్యింది.

రోడ్డు మీద దుర్బర జీవితం గడిపిన విక్టర్
విక్టర్ యనుకోవిచ్ బాల్య జీవితం చాలా దుర్బర జీవితం అని స్వయంగా ఆయనే అనేక ఇంటర్వూలల్లో చెప్పాడు. సోవియట్ యూనియన్ తూర్పు ఉక్రెయిన్ లో జన్మించిన విక్టర్ యనుకోవిచ్ చిన్న వయసులోనే తల్లిని పొగొట్టుకున్నాడు. తండ్రి గాలికి వదిలేయడంతో విక్టర్ రోడ్డుపాలైనాడు. బాల్య జీవితం ఎంతో ఘోరంగా గడిపిన విక్టర్ తరువాత ఎవ్వరూ ఊహించని ఎత్తుకు ఎదిగిపోయాడు. అక్రమాలకు పాల్పడిన విక్టర్ యనుకోవిచ్ తరువాత వ్యాపారవేత్తగా, రాజకీయ వేత్తగా రాణించి క్రమక్రమంగా ఎదిగిపోయాడు.

లూటీ కేసుల్లో జైలు జీవితం....... ఉక్రెయిన్ రాజకీయ నాయకుడిగా ?
17 ఏళ్ల వయసులోనే విక్టర్ యనుకోవిచ్ దొంగతనాలు, లూటీల కేసుల్లో జైలుకు వెళ్లాడు. విక్టర్ యునుకోవిచ్ నేరస్తుడని ఇప్పటికీ ఉక్రెయిన్ మీడియా అంటోంది. 1997 నుంచి 2002 వరకు విక్టర్ యనుకోవిచ్ తూర్పు ఉక్రెయిన్ లోని డొనెట్స్క్ గవర్నర్ గా పని చేశాడు. 2006 నంచి 2007 వరకు దేశ ప్రధానిగా పని చేశాడు,

దెబ్బకు విక్టర్ రష్యాకు దౌడ్
2010లో ఉక్రెయిన్ నాల్గవ అధ్యక్షుడిగా ఎన్నికైన విక్టర్ యనుకోవిచ్ 2013లో రష్యాకు అనుకూలంగా సంబంధాలు కోరుతూ యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందాల మీద సంతకాలు చెయ్యడానికి నిరాకరించాడు. అప్పుడే విక్టర్ యనుకోవిచ్ మీద ఆదేశ ప్రజలు తిరగబడంతో కథ అడ్డం తిరిగింది. అప్పుడు విక్టర్ యనుకోవిచ్ రష్యాకు పారిపోయి అక్కడే తలదాచుకుంటున్నాడు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications