
Russia vs Ukraine: రష్యాకు చావు దెబ్బ, సిఫ్ట్ నుంచి ఔట్, వేల కోట్ల యూరోల లావాదేవీలకు చెక్!
అమెరికా/ మాస్కో/రష్యా: ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యాకు ఊహించని షాక్ ఎదురైయ్యింది. ఉక్రెయిన్ పై యుద్దం నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని ప్రపంచ దేశాలు చేసున్న విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. దేవుడుకైనా దెబ్బే గురువు అనే సామెత లాగా రష్యాకు ఊహించని ఆర్థిక ఆంక్షలు విధించారు. అమెరికా, ఫ్యాన్స్, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఐరోపా కమీషన్ (ఈసీ) ఆఖరి అస్త్రాన్నీ ప్రయోగించడంతో రష్యా దిమ్మతిరిగిపోయింది.
ప్రపంచంలోని 200కు పైగా బ్యాంకుల మధ్య జరిగే లావాదేవీలకు అనుసంధానంగా వ్యవహరించే సొసైటీ ఫర్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ (స్విఫ్ట్) సమాచార వ్యవస్థ నుంచి రష్యాను బహిష్కరించడంతో ఆదేశ అధినేతతో పాటు ఆ దేశంలోని ప్రజలు షాక్ కు గురైనారని తెలిసింది.
ఈ దెబ్బతో రష్యా ఆర్థిక బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. స్విఫ్ట్ సమాచార వ్యవస్థ నుంచి ఎంపిక చేసిన రష్యా బ్యాంకులను తొలగిస్తామని, దీంతో ఆ బ్యాంకులు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కోల్పోతాయని తెలిపింది. రష్యా తన సహజవాయువు, చమురు ఎగుమతులకు కూడా స్విఫ్ట్ వ్యవస్థపైనే ఎక్కువగా ఆధారపడుతోంది.
గతంలో రష్యాలాగే పాటుపడి, అణు ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్ మీద ఇలాంటి తరహా నిషేధం పడింది. ఇప్పుడు ఇరాన్ బాటలోనే రష్యాకు కూడా సిఫ్ట్ సరైన బుద్ది చెప్పింది, సిఫ్ట్ నుంచి బహిష్కరణకు గురైన రష్యా బ్యాంకుల ఆర్థిక లావాదేవీలు ఇప్పుడు అతలాకుతలం అయ్యే అవకాశం ఉందని తెలిసింది.
Russia
VS
Ukraine:
రష్యా,
ఉక్రెయిన్
కు
తాలిబన్ల
ఉచిత
సలహ,
అబ్బా
ఏం
చెప్పితివి
ఏం
చెప్పితివి
!

రెచ్చిపోతున్న రష్యా
ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యాకు ఊహించని షాక్ ఎదురైయ్యింది. ఉక్రెయిన్ పై యుద్దం నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని ప్రపంచ దేశాలు చేసున్న విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. రష్యాను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ సైనికులు శక్తి వంచనలేకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు. పిచుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్లు రష్యా మాత్రం ఉక్రెయిన్ అంతు చూడాలని చూస్తోంది.

పెద్దన్న దెబ్బతో ఢమాల్
దేవుడుకైనా దెబ్బే గురువు అనే సామెత లాగా రష్యాకు ఊహించని ఆర్థిక ఆంక్షలు విధించారు. అమెరికా, ఫ్యాన్స్, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఐరోపా కమీషన్ (ఈసీ) ఆఖరి అస్త్రాన్నీ ప్రయోగించడంతో రష్యా దిమ్మతిరిగిపోయింది. శాంతిని కాపాడాలని, ఉక్రెయిన్ మీద యుద్దం ఆపాలని అమెరికా అధ్యక్షుడితో పాటు ప్రపంచ దేశాలు చేసిన విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పునిత్ ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేశాడు.

ప్రపంచ దేశాల బ్యాంకులు
ప్రపంచంలోని 200కు పైగా బ్యాంకుల మధ్య జరిగే లావాదేవీలకు అనుసంధానంగా వ్యవహరించే సొసైటీ ఫర్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ (స్విఫ్ట్) సమాచార వ్యవస్థ నుంచి రష్యాను బహిష్కరించడంతో ఆదేశ అధినేత వ్లాదిమిర్ పునిత్ తో పాటు ఆ దేశంలోని ప్రజలు షాక్ కు గురైనారని తెలిసింది. ఇప్పటి వరకు రష్యా మీద విధించిన ఆంక్షల్లో ఇదే చాలా కఠినమైనదని నిపుణులు అంటున్నారు.

8, 000 వేల కోట్ల యూరోలు
ఐరోపాతో రష్యా ప్రతిఏటా జరిపే వాణిస్యం విలువ సుమారు 8, 000 కోట్ల యూరోలు, సిఫ్ట్ నిషేధం దెబ్బతో రష్యాతో పాటు ఐరోపా ఆర్థిక వ్యవస్థ తారుమారు అయ్యే అవకాశం ఉంది, రష్యా మీద సిఫ్ట్ ప్రయోగించాలని ఒత్తిడి వచ్చినా ఐరోపా సమాజం మొదట వెనకాడుతూ వచ్చింది. చివిరికి రష్యా మీద సిఫ్ట్ ప్రయోగం చెయ్యడానికి ఐరోపా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రష్యా మీద సిఫ్ట్ ప్రయోగంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తమ బ్యాంకులు కూడా సిఫ్ట్ నుంచి రష్యాను తప్పిస్తాయని ఐరోపా తెలిపింది.

ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు క్లారిటి
ఈ దెబ్బతో రష్యా ఆర్థిక బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. స్విఫ్ట్ సమాచార వ్యవస్థ నుంచి ఎంపిక చేసిన రష్యా బ్యాంకులను తొలగిస్తామని, దీంతో ఆ బ్యాంకులు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కోల్పోతాయని తెలిపింది. రష్యా తన సహజవాయువు, చమురు ఎగుమతులకు కూడా స్విఫ్ట్ వ్యవస్థపైనే ఎక్కువగా ఆధారపడుతోంది.

అణ్వాయుధాలు అంటూ రెచ్చిపోయాడు
రష్యా మీద సిఫ్ట్ ప్రయోగం ఆంక్షలు సమర్థవంతంగా అమలు చేసేందుకు ట్రాన్స్ అట్లాంటిక్ సంయుక్త కార్యదళాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వానెడెర్ లియాన్ చెప్పారని స్థానిక మీడియా తెలిపింది. అణ్వాయుధాల ప్రయోగానికి సిద్దంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పునిత్ ఆ దేశ సైనికులకు ఆదేశాలు జారీ చేసిన సమయంలో రష్యా మీద సిఫ్ట్ ప్రయోగం కలకలం రేపింది.

గతంలో ఇరాన్...... ఇప్పుడు రష్యా
సర్వసాధారణంగా ఏ దైశం మీద అయినా సిఫ్ట్ ప్రయోగం చెయ్యడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. గతంలో అణు ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్ మీద ఇలాంటి తరహా నిషేధం పడింది. ఇప్పుడు ఇరాన్ బాటలోనే రష్యాకు కూడా సిఫ్ట్ సరైన బుద్ది చెప్పింది, సిఫ్ట్ నుంచి బహిష్కరణకు గురైన రష్యా బ్యాంకుల ఆర్థిక లావాదేవీలు ఇప్పుడు అతలాకుతలం అయ్యే అవకాశం ఉందని తెలిసింది.