వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంక్షలతో ఒంటరైన రష్యా-ISS క్రాష్ అవుతుందంటూ హెచ్చరికలు-రంగంలోకి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్

|
Google Oneindia TeluguNews

తమ భద్రత పేరుతో ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలుపెట్టి 20 రోజలు గడుస్తున్నా ఆ దేశంపై పట్టి సంపాదించడం పక్కనబెడితే కనీసం అంతర్జాతీయంగా మద్దతు కూడా కూడగట్టుకోలేకపోతున్న రష్యా.. తాజాగా మరో హెచ్చరికలకు దిగింది. అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్నానని గ్రహించి ఇప్పుడు ప్రపంచ పెద్దన్నలతో కలిసి తాము పంచుకుంటున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూల్చివేస్తామంటూ హెచ్చరికలు మొదలుపెట్టింది.

ఒంటరవుతున్న రష్యా

ఒంటరవుతున్న రష్యా

ఉక్రెయిన్ పై దండయాత్రతో ప్రపంచ దేశాలకు కంటగింపుగా మారిన రష్యా తన వైఖరి మార్చుకునేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. ముఖ్యంగా ఉక్రెయిన్ లో రోజూ వేలాది మంది సాధారణ పౌరులు చనిపోతున్నా, ఆస్పత్రులు, ప్రార్ధనాస్ధలాలను కూడా వదలకుండా బాంబులు వేస్తూ తమ శాడిజం చాటుకుంటున్న రష్యాకు అంతర్జాతీయంగా మద్దతు కరవవుతోంది.

ఒకప్పుడు తనకు సహకరించిన యూరప్ దేశాలే కాదు ఇప్పుడు రష్యాకు దగ్గరయ్యేందుకు, పూర్తి మద్దతు ఇచ్చేందుకు చైనా వంటి కమ్యూనిస్టు దేశాలూ సిద్ధంగా లేవు. దీంతో ప్రారంభించిన యుద్ధాన్ని మధ్యలో ఆపలేక, అలాగని రోజురోజుకూ పెరుగుతున్న ఆంక్షల నుంచి బయటపడలేక రష్యా విలవిల్లాడుతోంది.

 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గురి

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గురి

పశ్చిమ దేశాలతో పాటు నాటో దేశాలు, ఐరోపాలోని చిన్నా చితకా దేశాలు కూడా తమపై ఆంక్షలు విధిస్తుండటంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఎటూ పాలుపోవడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆంక్షల తొలగింపుకు అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి పెంచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇందుో భాగంగానే ఆగ్రరాజ్యాలతో కలిసి తాము పంచుకుంటున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూల్చివేస్తామంటూ పరోక్ష హెచ్చరికలు చేస్తున్నాడు. అదే విషయం నేరుగా చెప్పే పరిస్ధితి లేకపోవడంతో రష్యా అంతరిక్ష పరిశోధన కేంద్రం రోస్ కాస్మోస్ ద్వారా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసాతో పాటు మరికొన్ని స్పేస్ ఏజెన్సీలకు బెదిరింపు లేఖలు రాయించాడు.

 రోస్ కాస్మోస్ ఐఎస్ఎస్ క్రాష్ హెచ్చరిక

రోస్ కాస్మోస్ ఐఎస్ఎస్ క్రాష్ హెచ్చరిక

రష్యా అంతరిక్ష పరిశోధన సంస్ధ రోస్ కాస్మోస్ ఛీఫ్ డిమిత్రి రోగోజిన్.. నాసాతో ఇతర స్పేస్ ఏజెన్సీలకు రాసిన లేఖలో ఉక్రెయిన్‌పై మాస్కో దాడికి ముందు ఉన్న ఆంక్షల ఫలితంగా ఐఎస్ఎస్ కి సేవలందిస్తున్న రష్యన్ అంతరిక్ష నౌక ఆపరేషన్‌కు అంతరాయం కలిగించవచ్చని పేర్కొన్నారు. ఫలితంగా దాని కక్ష్యను సరిదిద్దడంలో సహాయపడే స్టేషన్ యొక్క రష్యన్ విభాగం ప్రభావితం కావచ్చన్నారు.

దీని వలన 500-టన్నుల నిర్మాణం "సముద్రంలోకి లేదా భూమిపైకి పడిపోయింది" అని రోస్కోస్మోస్ చీఫ్ టెలిగ్రామ్‌లో రాశారు.రష్యన్ సెగ్మెంట్ స్టేషన్ కక్ష్య సరిదిద్దామని, స్పేస్ శిధిలాలు నివారించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఐఎస్ఎస్ కూలిపోయే అవకాశం ఉన్న ప్రదేశాల మ్యాప్‌ను ప్రచురిస్తూ, అది రష్యాలో ఉండే అవకాశం లేదని ఆయన సూచించారు.

 రష్యా తప్పుకుంటే రంగంలోకి స్పేస్ ఎక్స్

రష్యా తప్పుకుంటే రంగంలోకి స్పేస్ ఎక్స్

ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రొపెల్షన్ వ్యవస్ధను రష్యా అందిస్తోంది. ఇప్పుడు ఆంక్షల పేరుతో దాన్ని ఉపసంహరించుకుని ఐఎస్ఎస్ క్రాష్ కు రష్యా కారణమవుతుందని భావిస్తే అప్పుడు స్పేస్ ఎక్స్ ను రంగంలోకి దింపేందుకు పశ్చిమ దేశాలు ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి.

ప్రస్తుతం ఐఎస్ఎస్ లో ఇంధన వ్యవస్ధను నిరుపయోగంగా మార్చే వ్యవస్ధల్ని అమెరికా పర్యవేక్షిస్తుండగా.. ఐఎస్ఎస్ నిరంతరం తగిన వేగంతో కక్షలో తిరిగే బాధ్యతను రష్యా పర్యవేక్షిస్తోంది. రష్యా ఇప్పుడు తన సేవలు నిలిపేస్తే ఐఎస్ఎస్ కుప్పకూలుతుంది. అలాంటి పరిస్ధితి వస్తే తమ స్పేస్ ఎక్స్ రంగంలోకి దిగుతుందని ఎలాన్ మస్క్ హామీ ఇచ్చారు.

English summary
russian space agency roscosmis on today warned that internatinoal space centre could crash with western countries sactions against them in wake of ukraine war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X