Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చొరబాటుకు యత్నించిన ఐదుగుర్ని కాల్చి చంపాం: రష్యా ప్రకటన, ఖండించిన ఉక్రెయిన్

మాస్కో: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. సరిహద్దుల్లో కాల్పుల మోత మొదలైంది. ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను హతమార్చినట్లు రష్యా తన తాజా ప్రకటనలో వెల్లడించింది. తమ దేశంలోకి చొరబడేందుకు ఉక్రెయిన్ విధ్వంసక, నిఘా బృందంపై కాల్పులు జరిపామని, కాల్పుల్లో ఐదుగురు మరణించారని వెల్లడించింది.

తమ భూభాగంలోనే వారిని హతమార్చినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా సరిహద్దు దాటేందుకు జరిగిన యత్నాలను అడ్డుకున్నామని సైన్యం తెలిపింది. కాల్పుల్లో తమ సైనికులెవరూ గాయపడలేదని పేర్కొంది. ఉక్రెయిన్ సాయు ధ దళాలు రెండు యుద్ధ వాహనాల్లో రష్యా భూభాగంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించాయని, అడ్డుకునేందుకు కాల్పులు జరిపామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కాల్పుల్లో రెండు వాహనాలు ధ్వంసమైనట్లు తెలిపారు.

 russian army says, killed 5 saboteurs from ukraine on russian territory, ukraine denies

కాగా, రష్యా సైన్యం ప్రకటనను ఉక్రెయిన్ మిలటరీ ఖండించింది. తమ సైనికులు చొరబాటుకు ప్రయత్నించారన్న రష్యా వాదనను ఉక్రెయిన్ తోసిపుచ్చింది. సరిహద్దుల్లో తాము కాల్పులకు పాల్పడుతున్నామని రష్యా చేసిన ఆరోపణలను కూడా ఉక్రెయిన్ సైన్యం ఖండించింది. ఉక్రెయిన్ సైన్యం జరిపిన కాల్పుల్లో తమ సరిహద్దు సైనిక స్థావరం ధ్వంసమైందని అంతకుముందు రష్యా ఆరోపిచింది. ఈ ఆరోఫణల్లో నిజం లేదని ఉక్రెయిన్ చెబుతోంది.

ఇవన్నీ ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు రష్యా రూపొందించిన అసత్య వార్తలని ఉక్రెయిన్ తెలిపింది. తమ సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ డానిలోవ్ తెలిపారు. తమ సైనికులకు ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. శాంతియుతంగా ఉండే పరిస్థితి లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరోక్షంగా హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+