షాకింగ్: ఈ దంపతులిద్దరూ.. 30 మందిని చంపి తినేశారు!

రష్యాలో ఓ దంపతులు నరమాంస భక్షకులుగా మారిపోయారు. వీరు ఇప్పటి వరకు 30 మందిని చంపి తినేశారు. వారి ఘాతుకం వెలుగుచూసిన వెంటనే పోలీసులు ఆ దంపతులను అరెస్టు చేశారు.

మాస్కో: రష్యాలో ఓ దంపతులు నరమాంస భక్షకులుగా మారిపోయారు. వీరు ఇప్పటి వరకు 30 మందిని చంపి తినేశారు. వారి ఘాతుకం వెలుగుచూసిన వెంటనే పోలీసులు ఆ దంపతులను అరెస్టు చేశారు.

రష్యాలోని క్రాస్‌నోడర్‌లో నివసిస్తున్న దిమిత్రీ బక్షీవ్‌(35), నటాలీ(42) భార్యాభర్తలు. చూడటానికి మామూలుగా కనిపించే ఈ దంపతులిద్దరూ 1999 నుంచీ నరమాంసం రుచిమరిగారు. అవసరమైనప్పుడల్లా దొరికిన మనిషిని దొరికట్లే చంపేసి తినేసేవారు.

Russian 'cannibal couple' suspected of killing up to 30 and posing with body parts

దిమిత్రీ భవన నిర్మాణ కార్మికుడిగా రోజంతా రెక్కలుముక్కలు చేసుకునేవాడు. భార్య నటాలీ మాత్రం ఇంట్లోనే కూచుని సీసాల కొద్దీ మద్యాన్ని ఖాళీ చేస్తుండేది. దిమిత్రీ ఓ రోజు తన మొబైల్‌ ఫోన్‌ను రోడ్డు పక్కనే మరిచిపోవడంతో ఈ సంచలన విషయం వెలుగుచూసింది.

దిమిత్రీ మొబైల్ ఫోన్ అతడితోపాటు పనిచేసే మరో భవన నిర్మాణ కార్మికుడికి దొరికింది.
ఎవరిదబ్బా ఈ ఫోను.. అని చూస్తుంటే అందులో ఖండఖండాలుగా నరికి ఉన్న మానవ శరీర భాగాల ఫొటోలు కనిపించాయి. ఉలిక్కిపడిన ఆ వ్యక్తి మరింతగా వెతికేసరికి దిమిత్రి ఫోటో ఒకటి కనిపించింది.

ఆ ఫొటోలో ఓ మనిషి మృతదేహం శరీరభాగాన్ని నోట్లో పెట్టుకుని నవ్వుతూ దిమిత్రి కనిపించాడు. దీంతో భయపడిన ఆ కార్మికుడు.. నేరుగా ఫోన్‌ను పట్టుకుని పోలీసుల వద్దకు వెళ్లాడు. చూడగానే పోలీసులకు అర్థమైపోయింది. వారు వెంటనే దిమిత్రీ నివాసంపై దాడిచేశారు.

దిమిత్రి ఇంట్లో పోలీసులకు కొన్ని మృతశరీర భాగాలు కనిపించాయి. నిల్వ చేసి ఉన్న మాంసం ముద్దలు కూడా కనిపించాయి. దీంతో పోలీసులు ఆ దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో... వారు నరమాంసం రుచిమరిగిన వైనం వెలుగు చూసింది. దాదాపుగా 10 సంవత్సరాలుగా ఆ ఇంట్లోనే నివసిస్తున్న దిమిత్రీ దంపతులు తమకు తెలుసని పొరుగునే ఉన్న ఓ దుకాణదారు తెలిపారు.

తమ దుకాణానికి తరచూ వచ్చే దిమిత్రీ దగ్గర నుంచీ ఓ రకమైన వింతవాసన వచ్చేదని చెప్పారు. దిమిత్రీ ఇంట్లో కుందేళ్లు, కుక్కలను పెంచుకుంటున్న నేపథ్యంలో తాను ఆ వాసనను పెద్దగా పట్టించుకోలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+