Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రష్యా నోట మూడో ప్రపంచ యుద్ధం మాట: అణ్వాయుధాలతో సర్వత్రా వినాశనమే: స్ట్రాంగ్ వార్నింగ్

మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టేశాయి రష్యా సైనిక బలగాలు. రాకెట్లతో విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోన్నాయి. సుమీ, ఖార్‌కీవ్ నగరాల్లో పెద్ద ఎత్తున దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకుంటోన్నాయి. ఖార్‌కీవ్‌ను సొంతం చేసుకున్నట్లుగా రష్యా సైన్యం ప్రకటించింది. సుమీని కైవసం చేసుకోవడానికి రష్యా సైన్యం దాడులు చేస్తోన్నాయి.

Recommended Video

    Russia Ukraine Conflict: EU Membership .. ఉక్రెయిన్ రష్యాను మరింత రెచ్చగొడుతోందా? | OneindiaTelugu
    యుద్ధం ఉగ్రరూపం..

    యుద్ధం ఉగ్రరూపం..

    ఉక్రెయిన్ సైనిక బలగాలు ప్రతిఘటిస్తోన్న కొద్దీ- రష్యా మరింత రెచ్చిపోతోంది. యుద్ధ తీవ్రతను రెట్టింపు చేస్తోంది. రాకెట్లను సంధిస్తోంది. మిస్సైళ్లను ప్రయోగిస్తోంది. కీవ్‌లోని భారీ భవంతులు, ప్రభుత్వ కార్యాలయాలపై రాకెట్లను సంధిస్తోన్నాయి. మిలటరీ అకాడమీ, ఆసుపత్రి ధ్వంసం అయ్యాయి. మంటల బారిన పడ్డాయి. ఈ దాడులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్ సైనికులు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోన్నాయి.

    న్యూక్లియర్ ట్రియాడ్‌ యాక్టివేట్..

    న్యూక్లియర్ ట్రియాడ్‌ యాక్టివేట్..


    ఈ పరిణామాల మధ్య- రష్యా విదేశాంగ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని వ్యాఖ్యలు అనడం కంటే హెచ్చరికగా స్వీకరించవచ్చు. తొలిసారిగా రష్యా నోట అణ్వాస్త్రాల మాట వినిపించింది. ఇది వరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్- న్యూక్లియర్ ట్రియాడ్‌ను యాక్టివేట్ చేశారు. భూమి, వాయు, జల మార్గాల్లో అణ్వస్త్రాలను ప్రయోగించడానికి అవసరమైన విభాగాధిపతులను ఆయన అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉండాలని సూచించారు.

    మంత్రి నోట న్యూక్లియర్ మాట..

    మంత్రి నోట న్యూక్లియర్ మాట..

    దీనికి కొనసాగింపుగా అన్నట్టుగా ఇప్పుడు తాజాగా రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్.. అణ్వాయుధాల ప్రస్తావనను తీసుకొచ్చారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధాన్ని తాము మూడో ప్రపంచ యుద్ధంగా మార్చుకోదలచుకోలేదని వ్యాఖ్యానించారు. అది తమ ప్రత్యర్థి స్పందనను బట్టి ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ అణ్వాయుధ సంపత్తిని సమకూర్చుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తోన్నామని స్పష్టం చేశారు.

    అణ్వాయుధ ఆధారంగా మూడో ప్రపంచ యుద్ధం..

    అణ్వాయుధ ఆధారంగా మూడో ప్రపంచ యుద్ధం..

    మూడో ప్రపంచ యుద్ధమే జరిగితే- అది పూర్తిగా అణ్వాయుధాలపైనే ఆధారపడి ఉంటుందని లావ్రోవ్ తేల్చి చెప్పారు. అణ్వాయుధ ప్రయోగాలతో కూడిన మూడో ప్రపంచ యుద్ధం వల్ల సర్వత్రా వినాశనం సంభవిస్తుందని హెచ్చరించారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ దేశాలు తమపై విధించే ఆంక్షలు, నిషేధాలను ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దీన్ని క్రీడలు, సాంస్కృతిక రంగాలకు కూడా విస్తరింపజేయడాన్ని ఊహించలేదని వ్యాఖ్యానించారు.

     అథ్లెట్లు, జర్నలిస్టులపైనా నిషేధమా?

    అథ్లెట్లు, జర్నలిస్టులపైనా నిషేధమా?

    ఆయా దేశాలన్నీ తమ దేశానికి చెందిన అథ్లెట్లు, జర్నలిస్టులు, చివరికి కళాకారులపైనా నిషేధాన్ని విధించడం ఏ మాత్రం సమర్థనీయం కాదని లావ్రోవ్ అన్నారు. కాగా- రష్యన్ తమ దేశ సముద్ర తీర ప్రాంతాల్లో న్యూక్లియర్ డ్రిల్‌ను కూడా నిర్వహించినట్లు వార్తలొస్తోన్నాయి. బ్యారెంట్ సముద్ర తీర ప్రాంతాల్లో దీనికి సంబంధించిన డ్రిల్స్‌ను చేపట్టినట్లు రష్యన్ మీడియా పేర్కొంది. దీన్ని బట్టి చూస్తోంటే- ఉక్రెయిన్‌పై కొనసాగిస్తోన్న యుద్ధాన్ని రష్యా మరింత తీవ్రతరం చేయడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి.

     ఆ రెండు నగరాలపై పట్టు..

    ఆ రెండు నగరాలపై పట్టు..

    మరోవంక- బేబిన్యార్, మరియోపోల్‌ నగరాలపై రష్యా సైనిక బలగాలు బాంబుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. ఈ ఆరు రోజుల్లో ఎప్పుడూ లేనంత ఉధృతిని ప్రదర్శిస్తోన్నాయి. మరియోపోల్‌పై ఎడతెరిపి లేకుండా రష్యా సైన్యం దాడులు చేస్తోందని, దాన్ని తమ సైనికులు తిప్పి కొడుతున్నారని నగర మేయర్ తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి, దాడుల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి వీలు కావట్లేదని అన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+