ఫ్లూటోనియంతో డర్టీబాంబు తయార్: ఉక్రెయిన్ వద్ద తిరుగులేని అస్త్రం: పుతిన్ మైండ్‌బ్లాక్

కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. యుద్ధం నుంచి ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గట్లేదు. ఢీ అంటే ఢీ అంటోన్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ.. రష్యా తన దాడుల తీవ్రతను మరింత పెంచుతూనే ఉంది. ఈ వారం రోజుల వ్యవధిలో 500 మిస్సైళ్లను రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై సంధించినట్లు కీవ్ ఇండిపెండెంట్ వెల్లడించింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దాదాపుగా పట్టు బిగించినట్టే కనిపిస్తోంది.

పలు నగరాలపై..

పలు నగరాలపై..


ఇప్పటికే ఖేర్సన్‌, మెలిటొపొల్ నగరాలు రష్యా సైనికుల ఆధీనంలోకి వెళ్లాయి. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైనికులు చేస్తోన్న ప్రయత్నాలను ఉక్రెయిన్ అడ్డుకుంటోంది. ఖార్కీవ్‌లో అదే పరిస్థితి నెలకొంది. ఛెర్నిహివ్, మరియోపొల్‌ నగరాలను రష్యన్ సైనిక బలగాలు చుట్టుముట్టాయి. ఏ క్షణమైనా ఛెర్నిహివ్.. రష్యా వశం కావచ్చంటూ వార్తలు వస్తోన్నాయి. ఒడెస్సా, బిలా సెర్క్వా, వొలిన్ ఒబ్లాస్ట్‌‌పై రష్యా వైమానిక బలగాలు బాంబుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి.

రష్యా ఆధీనంలో

రష్యా ఆధీనంలో

ఉక్రెయిన్‌కు చెందిన అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా ఇదివరకే స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్ వాయవ్య ప్రాంతంలోని ఎనెర్హొడార్ సిటీ గల ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూరప్‌లోనే అతిపెద్దది. దీనిపై రష్యన్ వైమానిక బలగాలు రాకెట్లతో దాడులు చేశాయి. దీన్ని స్వాధీనం చేసుకున్నాయి. రష్యా బలగాలు ఈ పవర్ ప్లాంట్ ఆవరణలోకి ప్రవేశించాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీన్ని మళ్లీ తమ వశంలోకి తెచ్చుకోవడానికి ఉక్రెయిన్ సైనికులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

 బాంబు పేల్చిన రష్యన్ మీడియా..

బాంబు పేల్చిన రష్యన్ మీడియా..


ఈ పరిణామాల మధ్య మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. రష్యా దూకుడును అడ్డుకోవడానికి ఉక్రెయిన్ కూడా అణ్వాయుధాన్ని తయారు చేసే పనిలో పడినట్లు సమాచారం. ఫ్లూటోనియం ఆధారిత డర్టీబాంబును ఉక్రెయిన్‌ను తయారు చేస్తోందంటూ రష్యన్ మీడియా వెల్లడించింది. టీఏఎస్ఎస్, ఆర్ఐఏ, ఇంటర్‌ఫ్యాక్స్ న్యూస్ ఏజెన్సీస్ ఈ విషయాన్ని పేర్కొన్నాయి. పేరు చెప్పడానికి ఇష్టపడని విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా ఈ విషయం తెలిసిందని స్పష్టం చేశాయి.

చెర్నోబిల్‌లో బాంబు తయారీ..

చెర్నోబిల్‌లో బాంబు తయారీ..

చెర్నోబిల్‌లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో డర్టీబాంబ్ తయారు చేసినట్లు రష్యా ఆరోపిస్తోంది. అణ్వాయుధాల తయారీ పట్ల తమకు ఏమాత్రం ఆసక్తి లేదంటూ పలుమార్లు స్పష్టం చేసిన ఉక్రెయిన్.. ఇప్పుడు తన వైఖరిని మార్చుకుందని, గుట్టుచప్పుడు కాకుండా ఫ్లూటోనియం ఆధారిత డర్టీబాంబ్‌ను తయారు చేస్తోన్నట్లు పేర్కొంది. రష్యా యుద్ధాన్ని ముమ్మరం చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ ఈ బాంబు తయారీలో నిమగ్నం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అణ్వాయుధాలను ప్రయోగిస్తుందా..

అణ్వాయుధాలను ప్రయోగిస్తుందా..


ఉక్రెయిన్‌సై యుద్దానికి దిగిన రష్యా.. తన అణ్వాయుధాలను సైతం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. బ్యారెంట్ సముద్ర తీర ప్రాంతంలో న్యూక్లియర్ డ్రిల్‌ను కూడా నిర్వహించినట్లు ఇదివరకు వార్తలొచ్చాయి. అదే సమయంలో న్యూక్లియర్ ట్రియాడ్‌ను సైతం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. యాక్టివేట్ చేశారు. ఈ పరిణామాల మధ్య రష్యాకు ధీటుగా సమాధానం ఇవ్వడానికి ఉక్రెయిన్ ఈ డర్టీ బాంబ్ తయారీలో నిమగ్నమైనట్లు వార్తలొస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+