వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాలో ఏం జరుగుతోంది: ఆ వ్లాదిమిర్ జైలుపాలు: హంతక ప్రభుత్వం: ఘాటుగా స్పందించిన అమెరికా

|
Google Oneindia TeluguNews

మాస్కో: రష్యా ఉక్రెయిన్ ఆరంభమైన యుద్ధం రోజుల తరబడి భీకరంగా కొనసాగుతోంది. 45 రోజులుగా సాగుతున్న యుద్ధం వల్ల రెండు వైపులా భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు ధ్వంసం అయ్యాయి. శిథిలాలుగా మారాయి. వేలాదిమంది రష్యన్ సైనికులు మరణించారు. ఒకవంక శాంతి చర్చలను నిర్వహిస్తూనే మరోవంక- యుద్ధాన్ని కొనసాగిస్తోంది రష్యా. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, క్రిమియా, ఖార్కీవ్ వంటి పలు నగరాలు రష్యా సైనిక బలగాల ఆధీనంలో ఉన్నాయి.

అరెస్టుల పర్వం..

అరెస్టుల పర్వం..

చెర్న్‌హీవ్, సుమీ తూర్పు ప్రాంత నగరాలపై రష్యా పట్టు సడలుతోంది. ఈ పరిణామాల మధ్య రష్యా ప్రభుత్వం- స్వదేశంలో తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. యుద్ధం ఆరంభమైన తొలి రోజుల్లో రష్యన్లు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి తమ నిరసనలను తెలియజేశారు. దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రతికూలంగా నినాదాలు చేశారు. ఇలా ప్రదర్శనలను నిర్వహించిన వేలాదిమందిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కొందరు ప్రముఖులను గృహనిర్బంధంలో ఉంచింది.

ప్రతిపక్ష నేత అరెస్ట్..

ప్రతిపక్ష నేత అరెస్ట్..

యుద్ధానికి వ్యతిరేకంగా ఎవరు గళమెత్తినా.. దాన్ని సహించట్లేదు. ఈ అరెస్టుల పర్వం ఇంకా తీవ్రతరమైంది. ప్రతిపక్ష నేత వ్లాదిమిర్ కారా ముర్జా అరెస్ట్ అయ్యారు. మాస్కోలోని ఆయన నివాసం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాస్కో శివార్లలోని ఖామోవ్‌నికిలో ఆయనను అరెస్ట్ చేశారు. దీనికి గల కారణాలను వివరించలేదు. రష్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయడమే ఈ అరెస్ట్‌కు దారి తీసి ఉండొచ్చని భావిస్తున్నారు.

హంతక ప్రభుత్వంగా..

హంతక ప్రభుత్వంగా..

అరెస్ట్ కావడానికి కొన్ని గంటల ముందు- ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేశారాయన. వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హంతక ప్రభుత్వంగా అభివర్ణించారు. ఓ హంతకుడు దేశాన్ని పాలిస్తున్నాడంటూ ఘాటు విమర్శలు చేశారు. యుద్ధం వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని, పాశ్చాత్య దేశాలన్నీ అపరాధిగా చూస్తున్నాయని, దీనికి బాధ్యత పుతిన్ వహించాల్సి ఉంటుందనీ మండిపడ్డారు.

స్పందించిన అమెరికా..

స్పందించిన అమెరికా..

ఈ ప్రదర్శన నిర్వహించిన కొద్దిసేపటికే భద్రత బలగాలు వ్లాదిమిర్ కారాముర్జాను అరెస్ట్ చేశారు. ఇదివరకు రెండుసార్లు ఆయనపై విషప్రయోగం జరిగింది. కారా ముర్జా అరెస్ట్ పట్ల అమెరికా ఘాటుగా స్పందించింది. రష్యన్ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరిస్తోందని మండిపడింది. కారాముర్జాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. రష్యా చర్యల వల్ల అమెరికా సహా ప్రపంచదేశాలు ఇబ్బందులకు గురవుతున్నాయని వ్యాఖ్యానించింది. సొంత పౌరులను అణచి వేస్తోందంటూ విమర్శించింది.

నిశితంగా గమనిస్తున్నాం..

నిశితంగా గమనిస్తున్నాం..

రష్యాపై ఇప్పటికే అమలు చేస్తోన్న ఆంక్షలు, నిషేధాజ్ఞలను తాము మరింత ఉధృతం చేస్తామని, తమతో కలిసి వచ్చే దేశలు రష్యాను పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చింది. పౌర హక్కులను అణచివేయడం, పౌర నేతలను అరెస్ట్ చేయడాన్ని తాము నిరసిస్తున్నామంటూ అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ ఓ ట్వీట్ చేశారు. రష్యాలో నెలకొన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని స్పష్టం చేశారు.

English summary
Russian opposition politician Vladimir Kara-Murza, who previously survived two suspected poisonings in Russia, was arrested near his home in Moscow. US State Secretary Antony Blinken said, We are monitoring this situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X