పాక్‌ ప్రధానితో మోడీ రహస్య దౌత్యం? జిందాల్ సమావేశం ఇందుకేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

క‌రాచీ: పాకిస్తాన్‌తో.. భార‌త్‌ ర‌హ‌స్య దౌత్యం నిర్వ‌హించిన‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌తో ప్ర‌ఖ్యాత‌ భార‌తీయ ఉక్కు వ్యాపార‌వేత్త స‌జ్జ‌న్ జిందాల్ భేటీ కావ‌డం తీవ్ర చ‌ర్చనీయాంశ‌మైంది.

నెల రోజుల క్రితం పాకిస్తాన్‌లోని ష‌రీఫ్ నివాసంలో జిందాల్ ఆయన్ని క‌లుసుకున్నారు. దీంతో భార‌త్‌, పాక్ ప్ర‌భుత్వాలు ర‌హ‌స్యంగా శాంతి దౌత్యం నిర్వ‌హిస్తున్నాయ‌న్న వార్త‌లు గుప్పుమ‌న్నాయి.

sajjan-jindal

కుటుంబ‌స‌భ్యులు, కొంత మంది స్నేహితుల‌తో జిందాల్ పాక్ ప్ర‌ధానితో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ అంశంపై ష‌రీఫ్ కూతురు మరియ‌మ్ న‌వాజ్ కూడా ట్వీట్ చేశారు. ష‌రీఫ్‌-స‌జ్జ‌న్ భేటీలో ర‌హ‌స్యం ఏమీలేద‌ని ఆమె అన్నారు.

పాకిస్తాన్ విదేశాంగ శాఖ కూడా ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాక‌రించింది. కానీ ఓ ప్రముఖ చానెల్ లో దీనిపై ప్రత్యేక క‌థ‌నం ప్రసారం కావడంతో ష‌రీఫ్‌-జిందాల్ భేటీపై స‌ర్వ‌త్రా చ‌ర్చ మొద‌లైంది.

ఇటీవ‌ల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఖామ‌ర్ జావెద్ బ‌జ్వాతో ష‌రీఫ్ భేటీ అయ్యారు. అక్క‌డ వాళ్లు ఇద్ద‌రూ స‌జ్జ‌న్ జిందాల్ అంశాన్ని చ‌ర్చించిన‌ట్లు తెలుస్తున్న‌ది.

ఇరు దేశాల మ‌ధ్య ఉన్న ఉద్రిక్త వాతావ‌ర‌ణాన్ని త‌గ్గించేందుకు భార‌త ప్ర‌భుత్వం జిందాల్‌ను దౌత్యం కోసం పంపించిన‌ట్లు ఆర్మీ చీఫ్‌తో ష‌రీఫ్ వెల్ల‌డించిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు అనుమానిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఖామ‌ర్ జావెద్ బ‌జ్వా కూడా ఆర్మీ ఆఫీస‌ర్ల‌కు ఈ అంశాన్ని స్ప‌ష్టం చేసిన‌ట్లు మ‌రికొన్ని వ‌ర్గాలు పేర్కొన్నాయి.

రెండు దేశాల ప్ర‌ధానులు క‌లుసుకునేందుకు జిందాల్ దౌత్యం ఉప‌క‌రిస్తుంద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే సదరు ప్ర‌ముఖ చానెల్ ప్రసారం చేసిన ఈ కథనంపై స్పందించేందుకు మాత్రం పాక్ ప్ర‌భుత్వం నిరాక‌రించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan Prime Minister Nawaz Sharif has told the country's powerful Army that his meeting with Indian steel tycoon Sajjan Jindal last month was part of back-channel diplomacy, a media report said on Thursday. BBC Urdu reported that Mr Sharif has taken Pakistan Army chief Qamar Javed Bajwa into confidence on his meeting with Mr Jindal on April 27 at the hill resort of Murree. Pakistan's government informed military authorities that Mr Sharif's hour-long meeting with Mr Jindal was a part of back-channel diplomacy. And Mr Jindal had the backing of some important Indian officials for the meeting to defuse ongoing tension between the two countries, the report said.
Please Wait while comments are loading...