వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు భారతీయలకు రామన్ మెగసెసె అవార్డు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేకంగా పోరాడిన ఎయిమ్స్ డిప్యూటీ సెక్రటరీ సంజీవ్ చతుర్వేది, గూంజ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు అన్షు గుప్తా ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డు-2015కు ఎంపికయ్యారు. హర్యానా క్యాడర్‌కు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి అయిన సంజీవ్ చతుర్వేది నిజాయితీ గల అధికారిగా పేరుంది.

ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ సంస్థలో జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తెచ్చారు. ప్రధాని కార్యాలయానికి కూడా ఆధారాలు పంపారు.
అయితే ఆ తర్వా ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు. రాజకీయ ఒత్తిడుల వల్లే కేంద్రం ఈ చర్య తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

Sanjeev Chaturvedi, Anshu Gupta win Ramon Magsaysay Award

ప్రస్తుతం చతుర్వేది ఎయిమ్స్ డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. గత ఐదేళ్లలో 12సార్లు బదిలీ కావడం ఆయన పనితీరుకు నిదర్శనం. చతుర్వేదిని ఢిల్లీ ప్రభుత్వానికి అటాచ్ చేయాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి గతంలోనే లేఖ కూడా రాశారు. కాగా, ఛతుర్వేది పిఎంఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తను ఆధారాలను పంపించినప్పటికీ పిఎంఓ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆరోపించారు.

ఇది ఇలా ఉండగా, లక్షల రూపాయలు వచ్చే కార్పొరేట్ ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని సమాజసేవకు అన్షుగుప్తా అంకితమయ్యారు. దేశంలో కొందరివద్ద వస్తువులు మిగులు ఉండటం, చాలామంది వద్ద కొరత ఉండటాన్ని గమనించిన ఈ వ్యత్యాసాలను తొలగించేందుకు 1999లో గూంజ్ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.

ఈ సంస్థ ప్రధానంగా పేదలందరికీ ఆహారం, దుస్తులు, ఆశ్రయం కల్పించాలన్న ఆశయంతో పనిచేస్తోంది. దుస్తులు, వస్తువులు, ఆహారం ఇలా ఏదైనా మిగులు అనుకున్నవాటినల్లా సేకరించి.. లేనివారికి అందజేస్తుంది.

ఈ కార్యక్రమాన్ని అనేక స్వచ్ఛందసంస్థలు దేశవ్యాప్తంగా అమలుచేస్తుండటం గమనార్హం. కాగా, ఇద్దరు భారతీయులతోపాటు మెగసెసె అవార్డుకు లావోస్‌కు చెందిన కామలి చాంతవాంగ్, ఫిలిప్పీన్స్‌కు చెందిన లిగయా ఫెర్నాండో-అమిల్‌బంగ్సా, మయన్మార్‌కు చెందిన క్యావ్ థు కూడా ఎంపికయ్యారు.

English summary
Kommaly Chanthavong from Laos, Ligaya Fernando-Amilbangsa from the Philippines and Kyaw Thu from Myanmar are the other recipients.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X