శారదా స్కాం: సీబీఐ సోదాలు, రెండో ఛార్జ్ షీట్ దాఖలు

Saradha, Seashore chit fund scams: CBI conducts raids in four cities
న్యూఢిల్లీ: శారదా చిట్ ఫండ్ స్కాం నిందితులపై సీబీఐ దాడులు ఉధృతం చేసింది. ఏకకాలంలో ముంబై, న్యూఢిల్లీతో పాటు ఒడిశాలోని మరో నాలుగు నగరాల్లో దాడులు నిర్వహించింది. ఈ కేసులకు సంబంధి శారదా చిట్ ఫండ్ గ్రూపు, సీషోర్ అక్రమాలపై సంబంధమున్న రాజకీయ నాయకులు, అధికారుల నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.

కోట్లాది రూపాయల ఈ స్కాంలో సీబీఐ అధికారులు రెండవ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్‌లో తృణమూల్ వైస్ ప్రెసిడెంట్, మాజీ డైరెక్టర్ జనరల్ (రాష్ట్ర సాయుధ పోలీసు) రజత్ మజుందార్, తూర్పు బెంగాల్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ దేవవ్రత సర్కార్‌లు ఈ కుంభకోణం ద్వారా సేకరించిన డబ్బుతో ప్రయోజనం పొందారని పేర్కొంది.

వీరితో పాటు శారదా చిట్ ఫండ్ ఛైర్మన్ సుదీఫ్త గుప్త, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేబ్జానీ ముఖర్జీ, బిజినెస్ మ్యాన్ సంధీర్ అగర్వాల్.. తండ్రి సజ్జన్ అగర్వాల్, అస్సాం సింగర్ సదానంద గగోయ్‌లు పేర్లను ఛార్జ్ షీట్‌లో పేర్కొంది.

ఈ కేసులో ఇప్పటికే తొలి ఛార్జ్ షీటును అక్టోబరు 22న కోర్టుకు సమర్పించారు. మరోవైపు ఇదే స్కాంలో ఈ రోజు ఒడిశాలోని 22 చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ స్కాంలో ప్రముఖ 'సీషోర్ గ్రూప్'కు సంబంధం ఉందంటూ ఆరోపణలు రావడంతో సోదాలు చేస్తున్నారు. బీజేపీ నేత ప్యారీమోహన్ మహాపాత్ర నివాసంలోనూ సోదాలు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+