వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషమించిన సౌదీ కింగ్ ఆరోగ్యం: ఆసుపత్రికి తరలింపు: ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్: ఆధునిక దేశంగా

|
Google Oneindia TeluguNews

రియాద్: ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో ఒక్కటైన సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్య పరిస్థితి కుదుట పడకపోవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. 84 సంవత్సరాల వయస్సున్న కింగ్ సల్మాన్..గాల్ బ్లాడర్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మూత్రపిండాలు, మూత్రనాళ సమస్యలకు సంబంధించిన ట్రీట్‌మెంట్‌ను ఆయనకు అందిస్తున్నట్లు చెబుతున్నారు.

Recommended Video

World May Not Have Space To Store Crude Oil

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: భార్య, కుమారుడికి కూడా: హోమ్ క్వారంటైన్‌లోకి కుటుంబం టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: భార్య, కుమారుడికి కూడా: హోమ్ క్వారంటైన్‌లోకి కుటుంబం

కింగ్ సల్మాన్.. ఆసుపత్రిలో చేరిన విషయాన్ని సౌదీ అరేబియా అధికారిక న్యూస్ ఏజెన్సీ సౌదీ ప్రెస్ ఏజెన్సీ (ఎస్పీఏ) నిర్ధారించింది. ప్రపంచలోనే అతిపెద్ద చమురు ఉత్పాదక దేశం సౌదీ అరేబియా. రెండున్నరేళ్ల కిందట ఈ దేశానికి రాజుగా ఎన్నికయ్యారు సల్మాన్. అంతకుముందు 2012 నుంచి క్రౌన్ ప్రిన్స్‌గా, డిప్యూటీగా వ్యవహరించారు. రియాధ్ రీజియన్‌కు ఆయన 50 సంవత్సరాల పాటు గవర్నర్‌గా పని చేశారు. కొద్దిరోజుల కిందట ఆయన అనారోగ్యానికి గురయ్యారు.

Saudi King Salman bin Abdulaziz admitted to hospital after suffering from gall bladder

తన రాజప్రాసాదంలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోకపోవడంతో హుటాహుటిన రాజధాని రియాద్‌లోని కింగ్ ఫైజల్ ఆసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న అనారోగ్యానికి తోడు గాల్ బ్లాడర్ సమస్యలు ఉత్పన్నమైనట్లు చెబుతున్నారు. ఆసుపత్రిలో ఆయనకు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. సాధారణ చెకప్ కోసం కింగ్ సల్మాన్ ఆసుపత్రిలో చేరినట్లు కూడా వార్తలు అందుతున్నాయి.

కింగ్ సల్మాన్ బిన్ ఆధునిక సౌదీ అరేబియాకు సారథ్యాన్ని వహిస్తున్నారనే గుర్తింపు పొందారు. మత ఛాందస భావాల నుంచి సౌదీ అరేబియాను బయటపడేలా చేశారనే గుర్తింపు ఉంది. మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులను మంజూరు చేయడం వంటి కొన్ని సంచలనాత్మక నిర్ణయాలను ఆయన తీసుకున్నారని, సౌదీ అరేబియాను ఆధునిక దేశంగా తీర్చిదిద్దారని అంటుంటారు. కింగ్ సల్మాన్ బిన్ వినూత్న ఒరవడిని పరిపాలనలో ప్రవేశపెట్టారని చెబుతుంటారు.

English summary
Saudi Arabia’s 84-year-old ruler King Salman bin Abdulaziz has been admitted to King Faisal Specialist hospital in the capital Riyadh for medical checks, the state news agency (SPA) reported early on Monday. It said the king, who has ruled the world’s largest oil exporter and the close US ally since 2015, was admitted for inflammation of the gallbladder, without giving further details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X