రూ.6,500కోట్లు చెల్లించి జైలు శిక్ష తప్పించుకున్న సౌదీ యువరాజు
రియాద్: అవినీతి ఆరోపణలతో జైలుపాలైన సౌదీ అరేబియా సీనియర్ యువరాజు మితెబ్ బిన్ అబ్దుల్లా ప్రభుత్వంతో భారీ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం రూ.6,500కోట్ల(1బిలియన్ డాలర్ల)కుపైగా సర్కారుకు చెల్లించేందుకు మితెన్ బిన్ అంగీకరించారు.
అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 20రోజుల క్రితం ఆయనను అరెస్ట్ చేశారు. తాను సంపాదించిన మొత్తం అక్రమాస్తులను ఆయన సర్కారుకి అప్పగించేందుకు ఒప్పుకోవడంతో యువరాజును జైలు నుంచి విడుదల చేశారు.

ఈ మేరకు అక్కడి అధికారులు తెలిపారు. ఈ యువరాజుతోపాటు మరో ముగ్గురు కూడా ప్రభుత్వం ఇలాగే ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. కాగా, సౌదీ ప్రభుత్వం ఇటీవల పలు సంస్కరణలను కూడా తీసుకొస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications