రెండో పెళ్లి చేసుకున్న భర్తకు భార్య 'ట్రాఫిక్' షాక్, రూ.50 లక్షల ఫైన్
దుబాయ్: రెండో పెళ్లి చేసుకుంటున్న త భర్తకు.. ఓ భార్య మతిపోయే షాక్ ఇచ్చింది. రెండో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి అతనికి 50 లక్షల రూపాయల జరిమానా పడేలా చేసింది. పెళ్లి రోజు రాత్రి నాటికి ఆ మొత్తం ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలు వచ్చేలా చేసింది.

తన భర్త రెండో పెళ్లి చేసుకుంటుండటంతో భార్యకు ఆగ్రహం వచ్చింది. తన సోదరుడిని పిలిచింది. అతనికి తన భర్త వాహనాన్ని ఇచ్చింది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ ఇష్టారీతిగా నడపమని చెప్పింది. దీంతో ఆ తమ్ముడు తన అక్క చెప్పిన పనిని చేశాడు.
కూడళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలకు కనిపించేలా అతను ఇష్టారీతిగా వాహనాన్ని నడిపాడు. దీంతో అధికారులు రూ.50 లక్షల జరిమానాను విధించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చక్కర్లు కొడుతోంది.












Click it and Unblock the Notifications