వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: పాకిస్తాన్ ప్రధాని పరువు తీసిన ఇయర్ ఫోన్ - నవ్వుతూ సినిమా చూసిన పుతిన్..!!

|
Google Oneindia TeluguNews

తాష్కెంట్: ఆసియా దేశాల్లో అత్యంత కీలకమైన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం ఇవ్వాళ ప్రారంభమైంది. ఈ ఆర్గనైజేషన్‌లో సభ్యత్వం ఉన్న దేశాధినేతలు, ప్రధానమంత్రులు సదస్సులో పాల్గొన్నారు. భారత్, పాకిస్తాన్, చైనా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజకిస్తాన్‌కు ఇందులో సభ్యత్వం ఉంది. ఈ దఫా ఉజ్బెకిస్తాన్ దీనికి ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఉజ్బెక్‌లోని సమర్‌ఖండ్‌లో ఈ సదస్సు ఏర్పాటైంది. ఇందులో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్‌ఖండ్ చేరుకున్నారు.

కీలకంగా మారిన శిఖరాగ్ర భేటీ.

కీలకంగా మారిన శిఖరాగ్ర భేటీ.

కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల వల్ల రెండు సంవత్సరాలుగా ఈ ఎస్‌సీఓ సదస్సు వాయిదా పడుతూ వచ్చింది. రెండేళ్ల తరువాత తొలిసారిగా ఇది ఏర్పాటైంది. సమ్మిట్ సందర్భంగా ఆయా దేశాధినేతలు, ప్రధానమంత్రులు ఎస్‌సీఓ సభ్య దేశాల కార్యకలాపాలను సమీక్షిస్తారు. భవిష్యత్తులో పరస్పర సహకారం, దౌత్య సంబంధాలు, వాణిజ్య-ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలు, ఇంధన వనరులపై చర్చించనున్నారు. లాజిస్టిక్ అంశం కూడా ప్రధానంగా ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రస్తావనకు రానుంది.

పుతిన్-షరీఫ్ భేటీ..

ఈ సదస్సుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ముఖాముఖి భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా వారిద్దరూ ఫేస్ టు ఫేస్ సమావేశం అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. రష్యా నుంచి తమ దేశానికి అందాల్సిన సహయ సహకారాలు, ఇంధన దిగుమతులు, చమురు నిక్షేపాల వెలికితీత, రక్షణ పరికరాలు, యుద్ధ సామాగ్రి తయారీ.. వంటి కీలక విషయాలు- షెహబాజ్ షరీఫ్, పుతిన్ మధ్య భేటీలో ప్రస్తావనకు వచ్చాయి.

ఇబ్బందికర పరిస్థితులు..

ఇబ్బందికర పరిస్థితులు..

ఆయిల్ అండ్ గ్యాస్ సరఫరా గురించి పాక్ ప్రధాని ప్రత్యేకంగా పుతిన్‌ దృష్టికి తీసుకెళ్లారు. చర్చల ప్రారంభంలో షెహబాజ్ షరీఫ్ కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇయర్ ఫోన్ వాడే విషయంలో ఆయన ఇబ్బంది పడ్డారు. భేటీ ప్రారంభంలో షెహబాజ్.. తనకు ఇచ్చిన ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకుంటూ కనిపించారు. తొలుత తన ఎడమ చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకోవడానికి ప్రయత్నించారు. అది సాధ్యం కాలేదు. కుడిచెవిలోకి అమర్చుకోవడానికి ప్రయత్నించారు గానీ సక్సెస్ కాలేదు. అది నిలవలేదు. కిందికి జారిపోయింది. ఇలా ఒకట్రెండు సార్లు ప్రయత్నించినప్పటికీ- దాన్ని చెవిలో పెట్టుకోవడం సాధ్యం కాలేదాయనకు.

ఇయర్ ఫోన్‌తో కుస్తీ..

ఇయర్ ఫోన్‌తో కుస్తీ..

దీనితో సమ్ బడీ హెల్ప్ మీ.. అని పిలిచారు. పక్కనే ఉన్న సహాయకుడొకరు ఇయర్ ఫోన్‌ను ఆయన చెవిలో అమర్చారు. సుమారుగా 50 సెకెన్ల పాటు పాక్ ప్రధాని ఇయర్ ఫోన్‌తో కుస్తీ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా- ఆయన ఉన్న వ్లాదిమిర్ పుతిన్ ఇదంతా చిరునవ్వుతూ చూస్తూ కూర్చున్నారు. ఇయర్ ఫోన్ సెట్ అయిన తరువాత ద్వైపాక్షిక అంశాలపై వారిద్దరూ మాట్లాడుకున్నారు.

English summary
Pakistan Prime Minister Shehbaz Sharif have faced struggles with earphones during bilateral meeting with Russian President Vladimir Putin during SCO summit at Uzbek's Samarkhand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X