Viral Video: చిన్నారిపై దాడికి యత్నంచిన సముద్రపు సింహం.. వీడియో వైరల్..
జంతువులతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే అవి ఎప్పుడు ఏం చేస్తాయో తెలియదు. తాజాగా సముద్రపు సింహం చిన్నారిపై దాడి చేసేందుకు యత్నంచిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిన్న పాపు సముద్ర సింహాన్ని ఎక్కి ఆడుకుంటుంది. ఆమె తల్లి వీడియో తీస్తుంది. ఇంతలో ఒక్కసారిగా సముద్ర సింహం పాపపై దాడికి యత్నించింది. దీంతో ఆమె కింద పడింది.
అక్కడున్న తండ్రి వెంటనే స్పందించి చిన్నారని పక్కకు లాగింది. అయితే ఈ వీడియో ఎక్కడ రికార్డ్ చేశారు అనేది ఇంకా తెలియాలేదు. వీడియోకు 20,600 పైగా వ్యూస్, 12,000 కంటే ఎక్కువ కామెంట్లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. " పిల్లలను అపాయంలోకి నెట్టడం ఏంటి అని" అని కామెంట్ చేశారు.సముద్ర సింహాలు సాధారణంగా చాలా ప్రశాంతమైన జీవులు.
Sea lion almost attacks child after parents decide to record her mounting it 🃏 pic.twitter.com/gjy2XLWq9B
— Public Outsider (@publicoutsider) July 12, 2022

అయినప్పటికీ, అవి మానవులతో అంత సున్నితంగా ఉండవు. గత నెలలో సముద్ర సింహం ఓ చిన్నారిని సముద్రంలోకి లాగిన వీడియో వైరల్‌గా మారింది. ఇటీవల, రెండు సముద్ర సింహాలు యుఎస్‌లోని ఒక బీచ్‌లో వ్యక్తుల గుంపును తరిమికొట్టడం కూడా ఇంటర్నెట్‌లో హల్ చల్ చేసింది. బాహ్య చెవి ఫ్లాప్‌లు, పొడవాటి ఫోర్‌ఫ్లిప్పర్లు, నాలుగు కాళ్లపై కదిలే సామర్థ్యం సముద్ర సింహం ప్రత్యేక లక్షణాలు.












Click it and Unblock the Notifications