వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంహెచ్370: శకలాల గుర్తింపు, 122 చిత్రాలు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: గల్లంతైన మలేసియా ఎంహెచ్ 370 విమానానికి సంబంధించి అత్యంత విశ్వసనీయమైన ఆధారాలు లభించాయని మలేసియా ప్రకటించింది. హిందూ మహా సముద్రంలో కూలిన మలేషియా విమానం శకలాలకు సంబంధించి ఫ్రాన్స్ ఉపగ్రహం 122 చిత్రాలను పంపించిందని తెలిపింది.

ఫ్రాన్స్ నుంచి గత ఆదివారం (23న) అందిన ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన మలేసియన్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎంఆర్ఎస్ఏ).. పెర్త్ (ఆస్ట్రేలియా) తీరం నుంచి 2557 కిలోమీటర్ల దూరంలో దక్షిణ హిందూ మహా సముద్రంలోని ఒక ప్రాంతంలో 400 చదరపు కిలోమీటర్ల పరిధిలో తేలుతున్న 122 వస్తువులను గమనించినట్టు మలేసియా మంత్రి హిషముద్దీన్ వెల్లడించారు.

హిందూ మహా సముద్రంలోని ఓ ప్రాంతంలో విమానానికి చెందిన వస్తువులను ఆ చిత్రాల్లో గుర్తించారన్నారు. ఫ్రాన్సుకు చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్, స్పేస్ ఉపగ్రహం ఈ చిత్రాలను పంపించిందని, వాటిని ఆదివారం తీసిందని అతను తెలిపారు. కాగా, మలేసియా ఎయిర్‌లైన్స్, బోయింగ్ సంస్థల నుంచి వివరాలు కోరుతూ అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలైంది.

 మలేషియా విమానం

మలేషియా విమానం

మలేషియా విమానానికి చెందిన కొన్ని శకలాలను ఫ్రాన్స్ శాటిలైట్ దక్షిణ హిందూ మహా సముద్రంలో గుర్తించింది. 122 ఫోటోలను పంపించింది.

మలేషియా విమానం

మలేషియా విమానం

ఎంహెచ్ 370 మలేషియా విమానంలో ఎక్కువ మంది చైనీయులే ఉన్నారు. ఈ విమాన ప్రమాదంపై దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ మృతుల కుటుంబ సభ్యులు చైనా రాజధాని బీజింగ్‌లో గల మలేషియా ఎంబసీ వద్ద ఆందోళన చేపట్టారు.

 మలేషియా విమానం

మలేషియా విమానం

ఎంహెచ్ 370 మలేషియా విమానం దక్షిణ హిందూ మహా సముద్రంలో కూలిపోయినట్లుగా భావిస్తున్న విషయం తెలిసిందే. విషాదంలో ఓ కుటంబం.

మలేషియా విమానం

మలేషియా విమానం

ఎంహెచ్ 370 మలేషియా విమానం దక్షిణ హిందూ మహా సముద్రంలో కూలిపోయినట్లుగా భావిస్తున్న విషయం తెలిసిందే. రోదిస్తున్న ఓ బాధిత ఓ కుటంబం.

English summary
The search for any signs of the missing Malaysia Airlines aircraft in the Australian Search and Rescue Region is set to resume around 8 a.m. Wednesday, the Australian Maritime Safety Authorities (AMSA) said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X