రెండోస్సారి.. ఇవాళ ట్రంప్ - కిమ్ చరిత్రాత్మక భేటీ
హనోరు : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ బుధవారం నాడు భేటీ కానున్నారు. వీరిద్దరి భేటీ రెండోసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వియత్నాం రాజధాని హనోరులో ఈ అగ్రనేతలు సమావేశమవుతారు. 2018, జూన్ లో ఇరుదేశాల అధినేతలు సింగపూర్ లో తొలిసారి భేటీ అయ్యారు. అప్పుడు కిమ్ ను పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్.. ఆయన మేధావి అంటూ కితాబిచ్చారు. అణ్వస్త్ర పరీక్షలకు బ్రేక్ వేయడానికి కిమ్ అంగీకరించినట్లు చెప్పారు.

ఒకవేళ అణ్వస్త్రాలను వదిలేందుకు సిద్ధమైతే ఉత్తరకొరియాకు సహకరిస్తామన్నారు ట్రంప్. తొలి భేటీ ఫలప్రదంగా కనిపించినప్పటికీ.. ఆ దేశంపై అమెరికా ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ నేపథ్యంలో రెండో దఫా వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో మళ్లీ ఆ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముందని ఉత్తరకొరియా ప్రెసిడెంట్ ఆఫీస్ వెల్లడించింది. చరిత్రాత్మక భేటీకి సంబంధించి హనోరుకు చేరుకున్న కిమ్ కు ఘనస్వాగతం లభించింది. అటు ట్రంప్ కూడా మంగళవారం నాడే హనోరుకు చేరుకున్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications